News July 11, 2024

స్మోక్ చేయని వారికీ లంగ్ క్యాన్సర్!

image

ఇండియాలోని లంగ్ క్యాన్సర్ పేషెంట్లలో ఎక్కువ మంది పొగతాగే అలవాటు లేనివారే ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. జన్యుపరంగా, గాలి కాలుష్యం వల్ల స్మోకింగ్ అలవాటు లేకున్నా చాలామందికి లంగ్ క్యాన్సర్ వస్తున్నట్లు తేల్చారు. అందుకే పట్టణ ప్రాంతాల్లో ఈ క్యాన్సర్ వృద్ధి ఎక్కువగా ఉందని, 2025నాటికి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాగా లంగ్ క్యాన్సర్ పేషెంట్లలో చైనా టాప్‌లో ఉండగా భారత్ 4వ స్థానంలో ఉంది.

Similar News

News February 13, 2025

బీర్ల ధరపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్ 

image

బీరుకు 30 నుంచి 40 రూపాయలు ధర పెంచారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నామమాత్రపు ధర పెంచితేనే గగ్గోలు పెట్టారని వాపోయారు. బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతమని, నాణ్యతలేని బీర్లు తీసుకొస్తున్నారని అన్నారు. బెల్టు షాపులు బంద్ చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారని ఇప్పుడూ సమాధానం చెప్పాలన్నారు.

News February 13, 2025

మంచి మాట – పద్యబాట

image

కానివాని తోడ గలసి మెలగుచున్న
గానివాని వలెనె కాంతు రతని
తాడి క్రింద బాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమ

భావం: దుష్టులతో కలిసి తిరిగితే మంచివాడిని కూడా ఈ లోకం చెడ్డవాడిగానే పరిగణిస్తుంది. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నా తాటికల్లు తాగుతున్నాడనే అనుకుంటారు కదా.

News February 13, 2025

కేఎల్ రాహులే మాకు ప్రాధాన్యం: గంభీర్

image

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ కీపింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ కోచ్ గంభీర్ ఆయనకు అండగా నిలిచారు. ‘టీమ్ ఇండియాకు ప్రస్తుతం రాహులే నంబర్ వన్ వికెట్ కీపర్. అతడే మా ప్రాధాన్యం. పంత్‌కు తన అవకాశాలు తనకొస్తాయి. ఇప్పటికైతే ఇద్దరు కీపర్లను ఆడించే పరిస్థితి లేదు’ అని తేల్చిచెప్పారు. పంత్‌తో పోలిస్తే రాహుల్ బ్యాటింగ్ రికార్డులు మెరుగ్గా ఉండటంతో అతడివైపే జట్టు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది.

error: Content is protected !!