News April 24, 2024

‘టిల్లు క్యూబ్’ సినిమాకు ‘మ్యాడ్’ డైరెక్టర్?

image

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. దీంతో వీటికి కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ రూపొందించనున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశముందని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మ్యాడ్ స్క్వేర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.

Similar News

News April 8, 2026

యుద్ధం.. 89 మంది దుర్మరణం

image

లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన <<19601083>>మెరుపుదాడుల్లో<<>> 89 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. రాజధాని బీరట్ సహా దక్షిణ లెబనాన్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. మిస్సైళ్ల ధాటికి భవనాలు నేలకూలగా శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. శిథిలాల వల్ల ఆస్పత్రులకు వెళ్లేందుకు సైతం దారులు లేక అంబులెన్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

News April 8, 2026

తులం బంగారం స్కీమ్.. UPDATE

image

TG: కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో కీలకమైన ‘తులం బంగారం’ అమలుకు మార్గదర్శకాలు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో స్థిరపడిన వారికే ఇది వర్తించనుంది. వధువుకు 18ఏళ్లు నిండి కుటుంబ వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలకు మించకూడదు. మొదటి వివాహం చేసుకునేవారికే వర్తిస్తుంది. ఈ నిబంధనలను అధికారులు CMకు అందించగా త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.