News April 11, 2025
మేడం బిల్లు కట్టరు..కానీ విమర్శిస్తారు: మంత్రి

BJP ఎంపీ కంగనా రనౌత్ రెండు నెలలుగా <<16040761>>కరెంట్ <<>>బిల్లు కట్టలేదని కాంగ్రెస్ మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు. మేడం బిల్లు కట్టరు పైగా బహిరంగ వేదికలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అల్లరి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. కాగా హిమాచల్‌ప్రదేశ్‌లో తాను ఇంట్లో ఉండకున్నా రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చిందని, కాంగ్రెస్ సర్కార్ సిగ్గుపడాలని, కంగనా ఆరోపించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 9, 2025
13న నరసాపురంలో జాతీయలోక్ అదాలత్: జడ్జి

ఈ నెల 13న నర్సాపురంలోని అన్ని కోర్టు సముదాయాలలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపురం పదో అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి తెలిపారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు సహకరించాలని న్యాయమూర్తి సూచించారు. రాజీపడదగిన అన్ని క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ వాహన ప్రమాద భీమాకు సంబంధించిన కేసులు, సివిల్ తగాదాలు, కుటుంబ తగాదాలు రాజీ చేసుకోవచ్చని చెప్పారు.
News December 9, 2025
రాయ్‌బరేలిలో ‘ఓట్ చోరీ’తో గెలిచిన ఇందిరా గాంధీ: బీజేపీ MP

భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె విమర్శించారు. రాయ్‌బరేలిలో ఇందిరా గాంధీ ‘ఓట్ చోరీ’తోనే గెలిచారని ఆరోపించారు. తాను RSS నుంచి వచ్చినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. లోక్‌సభలో ఎలక్షన్ రిఫామ్స్‌పై జరుగుతున్న చర్చలో RSS, ‘ఓట్ చోరీ’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను దూబె తిప్పికొట్టారు.
News December 9, 2025
తొలి టీ20: టాస్ ఓడిన భారత్

కటక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయాల నుంచి కోలుకున్న హార్దిక్, గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
IND: సూర్య(C), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్
SA: మార్క్రమ్(C), డికాక్, స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, జాన్సెన్, మహరాజ్, నోర్ట్జే, సిపామ్లా, ఎంగిడి


