News April 11, 2025

మేడం బిల్లు కట్టరు..కానీ విమర్శిస్తారు: మంత్రి

image

BJP ఎంపీ కంగనా రనౌత్ రెండు నెలలుగా <<16040761>>కరెంట్ <<>>బిల్లు కట్టలేదని కాంగ్రెస్ మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు. మేడం బిల్లు కట్టరు పైగా బహిరంగ వేదికలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అల్లరి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. కాగా హిమాచల్‌ప్రదేశ్‌లో తాను ఇంట్లో ఉండకున్నా రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చిందని, కాంగ్రెస్ సర్కార్ సిగ్గుపడాలని, కంగనా ఆరోపించిన సంగతి తెలిసిందే.

Similar News

News April 20, 2026

ఇండియా ఆఫర్‌ను తిరస్కరించా: రషీద్ ఖాన్

image

భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సిటిజన్‌షిప్ ఆఫర్లను తాను తిరస్కరించానని రషీద్ ఖాన్ తెలిపారు. ఈ 2 దేశాల తరపున ఆడే అవకాశం వచ్చినా సున్నితంగా వద్దని చెప్పినట్లు తన కొత్త పుస్తకంలో వెల్లడించారు. ‘నేను నా దేశం కోసం తప్ప, వేరే ఏ దేశం కోసం ఆడను’ అని చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 IPL సమయంలో ఇండియన్ క్రికెట్ బోర్డ్ అధికారి ఒకరు సిటిజన్‌షిప్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పారు.

News April 20, 2026

ఇరాన్ షిప్‌ను స్వాధీనం చేసుకున్నాం: ట్రంప్

image

హార్ముజ్ జలసంధిలో తమ దిగ్బంధనాన్ని దాటుకొని వెళ్లేందుకు యత్నించిన ఇరాన్ నౌక ‘టౌస్కా’ను స్వాధీనం చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వార్నింగ్స్ ఇచ్చినా వినకపోవడంతో తమ నేవీ రంగంలోకి దిగినట్లు చెప్పారు. తమ USS Spruance డెస్ట్రాయర్ ద్వారా ఇరాన్ షిప్‌ ఇంజిన్‌రూమ్‌పై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ స్వాధీనంలో ఉన్న ఆ నౌకలో ఏముందో పరిశీలిస్తున్నట్లు తెలిపారు.