News July 15, 2024
గిన్నిస్ రికార్డు సృష్టించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
24 గంటల్లో అత్యధిక మొక్కలు నాటిన టీమ్‌గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈనెల 13, 14 తేదీల్లో ఇండోర్‌లో 11 లక్షలకు పైగా మొక్కలు నాటి ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ X వేదికగా వెల్లడించారు. గిన్నిస్ రికార్డ్స్ ధ్రువపత్రం ఫొటోలను పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు అస్సాం అటవీశాఖ పేరిట ఉండేది. గత ఏడాది ఆ రాష్ట్రం 9లక్షలకుపైగా మొక్కల్ని నాటింది.
Similar News
News October 13, 2024
పూరీ ఆలయంలో భక్తులకు ఉచితంగా ప్రసాదం!
పూరీ జగన్నాథుడి ఆలయంలో భక్తులకు ఉచితంగా మహాప్రసాదాన్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పృథ్వీరాజ్ తెలిపారు. దీని వల్ల ఏటా ₹14-15 కోట్ల భారం పడుతుందన్నారు. అయితే, ఉచితంగా ప్రసాదం పంపిణీకి విరాళాలు ఇవ్వడానికి కొంత మంది భక్తులు ముందుకొచ్చినట్టు వెల్లడించారు. కార్తీక మాసం తరువాత అమలు చేసే అవకాశం ఉన్నట్టు మంత్రి తెలిపారు.
News October 13, 2024
రేపు మద్యం దుకాణాలకు లాటరీ
AP: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు అందాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ఖజానాకు రూ.1,797 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. రేపు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారు. ఎల్లుండి ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాలు అప్పగిస్తారు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది.
News October 13, 2024
PM గతిశక్తి ఓ గేమ్ ఛేంజర్: మోదీ
రైల్వే నుంచి విమానాశ్రయాల వరకు 7 కీలక రంగాల సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా ‘PM గతిశక్తి’ దేశ మౌలిక సదుపాయాల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీ పెరిగి వివిధ రంగాల్లో సమర్థవంతమైన పురోగతికి తోడ్పడిందన్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపడి ఆలస్యం తగ్గిందని, తద్వారా ఎంతో మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారని మోదీ పేర్కొన్నారు.