News October 9, 2024
రేవంత్ సర్కార్‌కు మాదిగలు బుద్ధి చెబుతారు: మందకృష్ణ

SC వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్ సర్కార్‌కు మాదిగలు బుద్ధి చెబుతారని MRPS అధ్యక్షుడు మందకృష్ణ హెచ్చరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మాల కావడం వల్లే మాదిగలకు రేవంత్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వర్గీకరణ తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇప్పుడు హడావుడిగా నియామకాలు చేపడుతున్న CM సమాధానం చెప్పాలన్నారు. DSC నియామకాలను నిరసిస్తూ MRPS రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.
Similar News
News January 25, 2026
సిరిసిల్ల: కన్న పేగు కంటతడి.. తల్లడిల్లిన గోమాత

కన్న పేగు మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఘటన వీర్నపల్లి మండలం ఎర్రగడ్డతండాలో జరిగింది. బానోత్ రాజు పశువులు సమీప అటవీకి మేతకు వెళ్లాయి. అక్కడే ఉన్న చిరుత లేగదూడపై దాడి చేసి హతమార్చింది. ఇంటికి చేరుకున్న ఆవు యజమానిని తచ్చాడి మృతిచెందిన బిడ్డ కళేబరం వద్దకు తీసుకెళ్ళింది. లేగదూడ కళేబరాన్ని ముద్దాడుతూ గోమాత తల్లడిల్లిన తీరు కలచివేసింది.
News January 25, 2026
పన్ను వసూళ్లలో ఎదురేలేదు..

ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ట్యాక్స్ వసూళ్ల విషయంలో హాంకాంగ్(13.1%), ఇండోనేషియా(13.1%), మలేషియా(12%)ను ఇండియా వెనక్కి నెట్టిందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో వెల్లడించింది. ‘దేశ ట్యాక్స్-GDP నిష్పత్తి 19.6%గా ఉంది. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట, GST, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం వంటివి ఇందుకు కారణం. జర్మనీ-38%, అమెరికా-25.6%తో మెరుగ్గా ఉన్నాయి’ అని పేర్కొంది.
News January 25, 2026
తల్లిపాల విషయంలో ఈ అపోహలు వద్దు

పిల్లలకు తల్లిపాలు అమృతతుల్యం. అయితే అపోహలతో కొందరు పిల్లలకు సరిగా పాలు పట్టట్లేదంటున్నారు నిపుణులు. సరిపడా పాలు రావట్లేదని కొందరు ఫార్ములా మిల్క్ ఇస్తుంటారు. కానీ పిల్లల తరచూ పాలు ఇస్తుంటేనే పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు. అలాగే ఫార్ములా మిల్క్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. తల్లిపాలలో ఇమ్యునిటీ, ఐక్యూ బెటర్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలకు తల్లిపాలే ఉత్తమం అని చెబుతున్నారు.


