News August 2, 2024

Madness.. విజయ్ ట్వీట్‌కు రష్మిక రిప్లై!

image

లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికల మధ్య ఉన్న స్నేహం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, హాలిడే ట్రిప్స్‌కు వెళ్లినట్లు రూమర్స్ కూడా వచ్చాయి. తాజాగా విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా గురించి చేసిన ట్వీట్‌కు రష్మిక రిప్లై ఇవ్వడంతో మరోసారి వీరి గురించి చర్చ మొదలైంది. #VD12 రిలీజ్ తేదీ ప్రకటిస్తూ లుక్‌ను రివీల్ చేయగా దీనికి Madness అని ఆమె కితాబిచ్చారు.

Similar News

News November 20, 2025

శ్రీకాకుళం జిల్లాలో రూ.25 వేల జీతంతో ఉద్యోగాలు

image

శ్రీకాకుళంలో రేపు జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో జరగనున్న జాబ్ మేళాకు చిక్కోల్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ కంపెనీలు హాజరుకానున్నాయి. టెన్త్-డిగ్రీ చదివిన పురుష అభ్యర్థులు ఈ మేళాకు అర్హులు. ఎంపికైన వారు శ్రీకాకుళం, నరసన్నపేటలో పని చేయాలని, రూ.15,000-25,000 జీతం ఇస్తారని ఆ శాఖాధికారి సుధా చెప్పారు. దరఖాస్తుకు https://WWW.NCS.GOV.IN వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.

News November 20, 2025

మరో ఉగ్ర దాడికి జైషే కుట్ర?

image

పాక్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ మన దేశంలో మరో దాడికి కుట్ర చేస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి స్క్వాడ్‌ను సిద్ధం చేస్తోందని హెచ్చరించాయి. ‘ఇందుకోసం జైషే నాయకులు డిజిటల్ మార్గాల్లో నిధుల సేకరణకు పిలుపునిచ్చారు. ₹6,400 చొప్పున ఇవ్వాలని అడుగుతున్నారు. వారు మహిళల నేతృత్వంలో దాడికి కుట్ర పన్నుతున్నారు’ అని తెలిపాయి. ఢిల్లీ పేలుడు ఘటనలో జైషే హస్తం ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

News November 20, 2025

బోర్డులను “బ్రోకర్ల డెన్‌”లుగా మార్చారు: సంజయ్‌

image

కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల భక్తులకు ప్రభుత్వం, దేవస్వం బోర్డు చేసిన ఏర్పాట్లు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. ఇటీవల AP భక్తులతో కేరళ పోలీసు అధికారి <<18328677>>అసభ్యకరంగా ప్రవర్తించడం<<>>పై మండిపడ్డారు. దేవస్వం బోర్డులను కమ్యూనిస్టులు “బ్రోకర్ల డెన్‌”లుగా మార్చి, ఆలయాలను ATM కేంద్రాలుగా చూస్తున్నారన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైరయ్యారు.