News August 2, 2024
Madness.. విజయ్ ట్వీట్‌కు రష్మిక రిప్లై!
లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికల మధ్య ఉన్న స్నేహం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, హాలిడే ట్రిప్స్‌కు వెళ్లినట్లు రూమర్స్ కూడా వచ్చాయి. తాజాగా విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా గురించి చేసిన ట్వీట్‌కు రష్మిక రిప్లై ఇవ్వడంతో మరోసారి వీరి గురించి చర్చ మొదలైంది. #VD12 రిలీజ్ తేదీ ప్రకటిస్తూ లుక్‌ను రివీల్ చేయగా దీనికి Madness అని ఆమె కితాబిచ్చారు.
Similar News
News October 14, 2024
ఇప్పుడున్నది పాకిస్థాన్ చరిత్రలోనే అత్యంత చెత్త జట్టు: వాన్
పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్న జట్టు, పాక్ చరిత్రలోనే అత్యంత చెత్త జట్టని తేల్చిచెప్పారు. ‘నాకు తెలిసినంత వరకూ ఇదే అత్యంత వరస్ట్ టీమ్. ఎటువంటి రిస్కులూ లేకుండా ఇంగ్లండ్ చాలా సునాయాసంగా 823 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు రూట్ ప్రత్యేకమైన ఆటగాడు. కచ్చితంగా సచిన్ రికార్డును బద్దలుగొడతాడు’ అని అంచనా వేశారు.
News October 14, 2024
టర్కిష్ ఎయిర్‌లైన్స్‌పై తాప్సీ ఆగ్రహం
టర్కిష్ ఎయిర్ లైన్స్‌పై హీరోయిన్ తాప్సీ ఫైర్ అయ్యారు. విమానం ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘విమానం 24 గంటల ఆలస్యం అనేది మీ సమస్య. ప్రయాణికుల సమస్య కాదు. కస్టమర్ కేర్ సర్వీస్ కూడా అందుబాటులో లేదు. దీంతో తోటి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా ఇటీవల శృతి హాసన్ కూడా ఇండిగో సంస్థపై మండిపడిన సంగతి తెలిసిందే.
News October 14, 2024
రజినీకాంత్ సినిమాలో ఆమిర్ ఖాన్?
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో లోకేశ్ కనగరాజ్ తీస్తున్న లేటెస్ట్ సినిమా ‘కూలీ’లో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కూడా మూవీలో నటిస్తారని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సినిమా ఒప్పుకొనేందుకు చాలా టైమ్ తీసుకునే ఆమిర్, కూలీలో పాత్ర గురించి లోకేశ్ చెప్పగానే ఓకే అన్నారని సమాచారం. ఈ నెల 15 నుంచి చెన్నైలో షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.