News September 11, 2024
రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న మదర్సాలు: NCPCR
మదర్సాల్లో విద్యాబోధన సమగ్రంగా లేదని NCPCR తెలిపింది. ఇది విద్యాహక్కు చట్టానికి విరుద్ధమంది. UP మదర్సా బోర్డుపై అలహాబాద్ హైకోర్టిచ్చిన తీర్పుపై సవాల్ పిటిషన్ నేపథ్యంలో అఫిడవిట్ సమర్పించింది. ‘మెరుగైన విద్యను పొందే హక్కును మదర్సాలు కాలరాస్తున్నాయి. పిల్లల ఎదుగుదలకు అవసరమైన వాతావరణం, అవకాశాలు అక్కడ లేవు. పైగా ముస్లిమేతరులకు ఇస్లామిక్ విద్యను అందిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి’ అని పేర్కొంది.
Similar News
News October 11, 2024
నీటి పారుదల శాఖకు రూ.284 కోట్లు విడుదల
AP: జలవనరుల ప్రాజెక్టుల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల కోసం నీటిపారుదల శాఖకు రూ.284.04 కోట్లు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఈ నిధులు విడుదల చేసింది. దీంతో కాలువలు, ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు వంటివి చేయనున్నారు. అంతకుముందు రూ.310 కోట్లతో ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ అంచనా వ్యయాన్ని పంపింది.
News October 11, 2024
GOOD NEWS.. వారికి బోనస్
కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-C ఉద్యోగులు, గ్రూప్-బి నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చి 31లోపు ఉద్యోగంలో చేరిన, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 నెలలు విధులు నిర్వహించిన వారు బోనస్‌కు అర్హులు. పనిచేసిన రోజులను బట్టి చెల్లింపులు ఉంటాయి. అర్హులైన ఉద్యోగులకు యావరేజ్‌గా రూ.6908 బోనస్ అందుతుంది. కేంద్ర పారామిలిటరీ, ఆర్మీ ఉద్యోగులూ అర్హులే.
News October 11, 2024
9 రోజుల్లో రూ.713 కోట్ల మద్యం తాగేశారు
TG: దసరా పండుగకు ముందు వరుస సెలవుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రేపు దసరా కావడంతో ఈ మూడు రోజుల్లో సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ.350 కోట్ల అమ్మకాలు అదనంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సారి బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.