News December 2, 2024

మహా సీఎం.. ‘పీఠ’ముడి వీడేది నేడే!

image

మహారాష్ట్ర CM పీఠంపై ఉత్కంఠకు నేడు తెర పడనుంది. ఇవాళ జరిగే సమావేశంలో దేవేంద్ర ఫడణవీస్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటామని BJP వర్గాలు తెలిపాయి. దీంతో CMగా ఆయన పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక బెట్టువీడిన ఏక్‌నాథ్ శిండే తన కొడుకుకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. మరోవైపు ఈనెల 5న MH సీఎం ప్రమాణస్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

Similar News

News January 15, 2026

మునగ సాగుతో ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం

image

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్‌రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్‌లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఉమేశ్ సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.

News January 15, 2026

నేటి నుంచి U-19 వన్డే వరల్డ్ కప్

image

జింబాబ్వేలో నేటి నుంచి ICC U-19 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జులవాయో వేదికగా ఇవాళ భారత జట్టు USAను ఢీకొట్టనుంది. ఇప్పటి వరకు 16 సార్లు టోర్నీ జరగ్గా IND 5 టైటిళ్లు గెలిచింది. ఆరోసారి కప్ సొంతం చేసుకోవాలని ఆయుష్ మాత్రే సారథ్యంలో బరిలోకి దిగుతోంది. ఇక 14ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి నిలిచింది. అటు ఇవాళ ఇతర మ్యాచుల్లో జింబాబ్వే-స్కాట్లాండ్, టాంజానియా-వెస్టిండీస్ పోటీ పడనున్నాయి.

News January 15, 2026

సేంద్రియ సాగుతోనే సక్సెస్

image

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు ఉమేష్ వ్యవసాయం ప్రారంభించారు. రెండు ఎకరాల్లో ఒకవైపు సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నారు. కోడి ఎరువు, మేక ఎరువు, ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా మార్చారు. మార్కెట్ స్టడీ చేసి ఓడీసీ-3 వెరైటీ మునగ మొక్కలను నాటారు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి, ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.