News November 24, 2024
208 ఓట్ల తేడాతో గెలిచిన మహా కాంగ్రెస్ చీఫ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం మూట కట్టుకోగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నానా పటోలే కొద్ది ఓట్ల తేడాతో గట్టెక్కారు. సకోలి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అవినాష్ బ్రహ్మంకర్పై 208 ఓట్ల తేడాతో గెలుపొందారు. పటోలేకు 96,795 ఓట్లు రాగా, బ్రహ్మంకర్కు 96,587 ఓట్లు వచ్చాయి. ఓవరాల్గా అత్యల్ప మెజారిటీ MIM అభ్యర్థి ముఫ్తీ మహ్మద్ ఖలీక్(162 ఓట్లు)ది కావడం గమనార్హం.
Similar News
News November 24, 2024
గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత ఎప్పుడంటే?
TG: డిసెంబర్ 1 నుంచి 9 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలలో గ్రూప్-4 నియామక పత్రాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వచ్చే నెల పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వెలువడిన తుది ఫలితాల్లో TGPSC 8,084 మంది అభ్యర్థులను పలు పోస్టులకు ఎంపిక చేసింది.
News November 24, 2024
ఈ నెల 29న విశాఖకు ప్రధాని
AP: ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖపట్నంకు రానున్నారు. సాయంత్రం ఏయూ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ క్రమంలో వర్చువల్గానే హైడ్రో ప్రాజెక్టుకు, ఫార్మా ఎస్ఈజెడ్లో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై సీఎస్ నీరభ్ కుమార్ ఇవాళ, రేపు విశాఖలో సమీక్షించనున్నారు.
News November 24, 2024
రాజ్ థాక్రేకు భంగపాటు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ థాక్రేకు చెందిన నవ నిర్మాణ సేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 125 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. 2006లో రాజ్ థాక్రే ఈ పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీలో 13 స్థానాల్లో, 2019 ఎన్నికల్లో ఒక చోట గెలుపొందారు.