News November 3, 2024

‘మహా’ ఎన్నికలు.. ప్రచారానికి ప్రధాని మోదీ

image

మహారాష్ట్రలో మరోసారి ‘మహాయుతి’ని అధికారంలోకి తెచ్చేందుకు BJP వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా PM మోదీ రంగంలోకి దిగనున్నారు. ఈనెల 8-14 మధ్య ఆయన 11 ర్యాలీల్లో పాల్గొననున్నారు. ‘మహాయుతి’ చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థించనున్నారు. BJP, శివసేన(ఏక్‌నాథ్ షిండే వర్గం), అజిత్ పవార్ నేతృత్వంలోని NCP మహాయుతిగా ఏర్పడి, కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. NOV 20న MH ఎలక్షన్స్ జరుగుతాయి.

Similar News

News December 6, 2024

పుష్ప-2 అద్భుతం.. యంగ్ హీరోల ప్రశంసలు

image

పుష్ప-2 సినిమాపై యంగ్ హీరోలు సందీప్ కిషన్, శ్రీవిష్ణు ప్రశంసలు కురిపించారు. ‘నాకు ఇష్టమైన అల్లు అర్జున్, సుకుమార్, ఫహాద్, రష్మిక, శ్రీలీల, DSP ప్రదర్శన అమోఘం. ఎక్కడ చూసినా ఇదే వైబ్ కొనసాగుతోంది’ అని సందీప్ పేర్కొన్నారు. ‘బన్నీ రప్పా రప్పా పర్‌ఫార్మెన్స్, సుకుమార్ విజినరీ డైరెక్షన్, రష్మిక, ఫహాద్ నటన అద్భుతం. మూవీ టీమ్‌కు కంగ్రాట్స్’ అని శ్రీవిష్ణు రాసుకొచ్చారు.

News December 6, 2024

నాన్ ఓపెనర్‌గా రోహిత్ శర్మ గణాంకాలివే

image

AUSతో ఇవాళ్టి నుంచి జరిగే రెండో టెస్టులో తాను ఓపెనర్‌గా <<14796317>>రావట్లేదని<<>> కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించారు. అతను గతంలో 3-5 స్థానాల్లో బ్యాటింగ్ చేసినప్పుడు రికార్డు గొప్పగా లేదు. మూడో స్థానంలో ఐదుసార్లు ఆడి 107 రన్స్, ఫోర్త్ ప్లేస్‌లో ఓ సారి కేవలం 4 పరుగులు చేశారు. ఐదో స్థానంలో 437 రన్స్, ఆరో ప్లేస్‌లో 1,037 పరుగులు సాధించారు. మరి ఈ డేనైట్ టెస్టులో ఎలా రాణిస్తారో వేచి చూడాలి.

News December 6, 2024

మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ ఎగ్జామ్స్?

image

AP: రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇంటర్ విద్యా మండలి ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. అలాగే ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను బోర్డు ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నాయి.