News January 13, 2025
నేటి నుంచి మహా కుంభమేళా
నేటి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనుంది. సుమారు 45 కోట్ల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. దీని నిర్వహణ కోసం యూపీ ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించింది. ఫిబ్రవరి 26వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది.
Similar News
News January 13, 2025
బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ అదుర్స్
నందమూరి బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్సులో అదరగొడుతున్నారు. అఖండ నుంచి వరుసగా 4 సినిమాలు హిట్ అయ్యాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. వీటికి ముందు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ మూవీలతో బాలయ్య పరాజయాలను ఎదుర్కొన్నారు. బాలకృష్ణ తన తర్వాతి సినిమా బోయపాటితో అఖండ-2 చేయబోతున్నారు.
News January 13, 2025
ఈ రోజున శివుడిని పూజిస్తే..
ఇవాళ చాలా ప్రత్యేకమైనది. పుష్య మాసంలో సోమవారం రోజున భోగి, పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం చాలా అరుదని పండితులు చెబుతున్నారు. ఏకాదశ రుద్రాలను పూజిస్తే లభించే ఫలితం ఇవాళ శివుడిని పూజిస్తే కలుగుతుందని అంటున్నారు. నువ్వుల నూనెతో దీపారాధన, పూజగదిలో శివ లింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. ఓం నమ: శివాయ అని పఠిస్తే ప్రయోజనకరమని అంటున్నారు.
News January 13, 2025
నేటి నుంచి ఖో ఖో వరల్డ్ కప్
ఖో ఖో క్రీడా చరిత్రలోనే తొలి వరల్డ్ కప్ నేటి నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనుంది. భారత ఖోఖో సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం 23 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. భారత పురుషుల జట్టు నేడు నేపాల్‌తో, మహిళల జట్టు రేపు ద.కొరియాతో ఆడనుంది. రాత్రి 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, DD స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు. తెలుగు కుర్రాళ్లు శివారెడ్డి, జానకిరామ్(స్టాండ్ బై)కి జట్టులో చోటు దక్కింది.