News January 13, 2025
నేటి నుంచి మహా కుంభమేళా

నేటి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనుంది. సుమారు 45 కోట్ల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. దీని నిర్వహణ కోసం యూపీ ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించింది. ఫిబ్రవరి 26వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది.
Similar News
News February 7, 2025
బీసీ, ఈబీసీలకు శుభవార్త

AP: స్వయం ఉపాధి కోసం BC కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 12 వరకు పొడిగించింది. అర్హులైన BC, EBCలు అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సవిత సూచించారు. కుట్టు శిక్షణ, కోళ్లఫారాలు, పాడి, ఫొటో స్టూడియోలు, జిరాక్స్ షాపులు, ఇంటర్ నెట్ కేంద్రాలు, బ్యూటీపార్లర్లు తదితర యూనిట్లకు రూ.2-5లక్షల రుణం ఇస్తారు. ఇందులో 50% సబ్సిడీ లభిస్తుంది.
వెబ్‌సైట్: <
News February 7, 2025
AP: బీసీ, ఈబీసీలకు సబ్సిడీ రుణాలు.. అర్హతలివే

✒ వయసు 21-60 ఏళ్ల మధ్య ఉండాలి. వార్షికాదాయం పట్టణాల్లో 1.30లక్షలు, గ్రామాల్లో రూ.81వేల లోపు ఉండాలి.
✒ రేషన్ కార్డులో ఒక్కరు మాత్రమే అర్హులు
✒ కావాల్సిన పత్రాలు: వైట్ రేషన్ కార్డు, కుల, వయసు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, ఫొటో
✒ 1,30,000 మంది బీసీలకు రూ.896 కోట్లు, ఈబీసీ వర్గాలు(బ్రాహ్మిణ్, క్షత్రియ, రెడ్డి, కమ్మ, వైశ్య, కాపు)లకు రూ.384 కోట్లు కేటాయించారు.
News February 7, 2025
రెండో వన్డేలో విరాట్ ఆడతారా? గిల్ జవాబిదే

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి ODIకి విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. మోకాలిలో వాపు కారణంగా ఆయన తప్పుకొన్నారు. మరి రెండో వన్డేలో ఆడతారా? ఈ ప్రశ్నకు బ్యాటర్ శుభ్‌మన్ గిల్ జవాబిచ్చారు. ‘సరిగ్గా మ్యాచ్ రోజు నిద్రలేచే సమయానికి విరాట్ మోకాలు వాచింది. దీంతో ముందు జాగ్రత్తగా తొలి వన్డే మ్యాచ్ నుంచి తప్పుకొన్నారు. అది పెద్ద గాయం కాదు. రెండో మ్యాచ్ కచ్చితంగా ఆడతారనుకుంటున్నాను’ అని తెలిపారు.