News January 6, 2025
మహా కుంభమేళా.. ఈ రోజుల్లో పవిత్ర స్నానాలు
మహా కుంభమేళా జరిగే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో భక్తులు పవిత్రస్నానాలు ఆచరిస్తారు. ముఖ్యంగా పుష్య పూర్ణిమ(JAN 13), మకర సంక్రాంతి(JAN 14), మౌని అమావాస్య(JAN 29), వసంత పంచమి(FEB 3), మాఘ పూర్ణిమ(FEB 12), మహా శివరాత్రి(FEB 26) రోజులు పవిత్రమైనని. ఆ సమయాల్లో స్నానాలు చేస్తే చంద్రుడు, ఇతర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని, ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్ఫలితాలు ఉంటాయని నమ్మకం.
Similar News
News January 7, 2025
ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం
AP: ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇవాళ నెట్ వర్క్ ఆసుపత్రులతో అధికారులు సమావేశమయ్యారు. ఏప్రిల్ 1 నుంచి బీమా పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవ అందించాలని డిసైడ్ చేశారు. మరోవైపు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
News January 7, 2025
గిల్‌కు అంత సీన్ లేదు: మాజీ సెలక్టర్
శుభ్‌మన్ గిల్ ఓ ఓవర్‌రేటెడ్ క్రికెటర్ అని, ఆయనకు భారత్ అన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నా మాట ఎవరూ వినలేదు. గిల్‌కు అంత సీన్ లేదు. అతడి బదులు సూర్యకుమార్, రుతురాజ్, సాయి సుదర్శన్ వంటి వారిని ప్రోత్సహించాలి. ప్రతిభావంతులకు బదులు గిల్‌కు ఛాన్సులిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
News January 7, 2025
తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ, ఆ విషయాన్ని రెండు రాష్ట్రాల భాషల్లో ట్వీట్ చేశారు. ‘విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటాను. విశాఖపట్నం ప్రజల మధ్య సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నాను. అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ, కృష్ణ పట్నం పారిశ్రామిక ప్రాంతం (KRIS సిటీ) శంకుస్థాపన కార్యక్రమాలలో కూడా పాల్గొంటాను’ అని పేర్కొన్నారు.