News July 12, 2024
ఓటీటీలోకి వచ్చేసిన ‘మహారాజ’

విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అన్ని భాషల్లో కలిపి రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
Similar News
News February 19, 2025
మోదీని కలిసిన రిషి సునాక్ ఫ్యామిలీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కుటుంబ సమేతంగా కలిశారు. వారి వెంట సునాక్ అత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా బ్రిటన్ మాజీ ప్రధాని ఫ్యామిలీతో కలిసి భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
News February 19, 2025
ALL TIME RECORD

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. చరిత్రలో తొలిసారిగా ఇవాళ ఉదయం 7 గంటలకు 16,058 మెగావాట్ల మైలురాయిని చేరుకుంది. ఈ నెల 10న నమోదైన 15,998 మెగావాట్ల రికార్డును రాష్ట్రం అధిగమించింది. దీంతో విద్యుత్ సరఫరాపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. ఎంత పెరిగినా దానికి తగ్గట్లు సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు.
News February 19, 2025
ఐఏఎస్‌లు బానిసల్లా పనిచేయొద్దు: ఈటల

TG: కాంగ్రెస్ పాలనలో అధికారుల తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌లు నేతలకు బానిసల్లా పనిచేయొద్దని అన్నారు. ప్రభుత్వాలు ఐదేళ్లే ఉంటాయని, ఐఏఎస్‌లు 35 ఏళ్లు ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నేతలకు అనుగుణంగా పనిచేసేవారు గతంలో జైలు పాలయ్యారని చెప్పారు. తాము కాషాయ బుక్ మెంటైన్ చేస్తున్నామని, అలాంటి వారు కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.