News October 7, 2024
‘మహారాజ’ దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’ చిత్రం 100 డేస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్‌కు నిర్మాతలు సర్ఫ్రైజ్ ఇచ్చారు. ఖరీదైన BMW కారును హీరో చేతుల మీదుగా అందించారు. ఈ మూవీ ₹110 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ వ్యూస్‌లోనూ అదరగొట్టింది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి, నటరాజన్ కీలక పాత్రలు పోషించారు.
Similar News
News January 26, 2026
మేం ఆడాలనుకున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఇదే: సూర్య

T20 WCకు ముందు టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘ముందుగా బ్యాటింగ్ చేసినా బౌలింగ్ చేసినా మేము ఆడాలనుకున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఇదే. వికెట్లు కోల్పోయినప్పుడు ఎలా ఆడాలో మాకు తెలుసు. కాస్త డిఫరెంట్‌గా ముందుకు వెళ్లాలనుకుంటే ఇదే ఉత్తమమైన మార్గం. టాప్-3 బ్యాటర్లు నా పనిని మరింత సులభం చేశారు’ అని NZతో మ్యాచ్ అనంతరం ఆయన చెప్పారు. నిన్న 10 ఓవర్లలో <<18957732>>మ్యాచ్‌ను<<>> ఫినిష్ చేశారు.
News January 26, 2026
బీర పంటలో మంచి దిగుబడి, ధర రావాలంటే..

బీర విత్తనాలను నాటిన తర్వాత మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3గ్రా. బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. దీని వల్ల ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి పెరుగుతుంది. అలాగే విత్తనం రకాన్ని బట్టి బీర పంట 60 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. కాయలు లేతగా ఉన్నప్పుడే కోయాలి. ముదిరితే పీచు పదార్థం ఎక్కువై మార్కెట్‌కి పనికి రాకుండా పోతాయి. కాయలను ఒక అంగుళం కాడతో సహా కోయాలి.
News January 26, 2026
కొబ్బరిపాలతో చర్మ సంరక్షణ

వంటల్లో ఎక్కువగా వాడే కొబ్బరి పాలు సౌందర్య సంరక్షణలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్ చర్మంపై మృతకణాలను తొలగిస్తాయి. దాంతో పాటు ముడతలు, మచ్చలు తగ్గించి యవ్వన చర్మాన్ని ఇస్తాయి. మొటిమలు, ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే వీటిని జుట్టుకు పట్టిస్తే కుదుళ్లను దృఢంగా చేస్తాయని చెబుతున్నారు.


