News October 7, 2024

‘మహారాజ’ దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్

image

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’ చిత్రం 100 డేస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్‌‌కు నిర్మాతలు సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. ఖరీదైన BMW కారును హీరో చేతుల మీదుగా అందించారు. ఈ మూవీ ₹110 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ వ్యూస్‌లోనూ అదరగొట్టింది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి, నటరాజన్ కీలక పాత్రలు పోషించారు.

Similar News

News November 13, 2024

ఆస్ట్రేలియాలో విరుష్క జంట చక్కర్లు

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య అనుష్క శర్మ, కుమారుడు అకాయ్‌తో విరాట్ పెర్త్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం కోహ్లీ రెండు వారాల ముందుగానే అక్కడికి వెళ్లారు. టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకే ఆయన త్వరగా వెళ్లినట్లు తెలుస్తోంది. మిగతా భారత ప్లేయర్లు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు.

News November 13, 2024

‘పుష్ప2’: శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతంటే?

image

టాలీవుడ్‌ తెరకెక్కిస్తోన్న మరో ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అందులో యంగ్ బ్యూటీ శ్రీలీల చిందులతో సందడి చేయనున్నారు. అందుకోసం రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ‘పుష్ప1’లో సమంత రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అటు ఈ మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

News November 13, 2024

మండలి నుంచి YCP ఎమ్మెల్సీల వాకౌట్

image

AP: శాసనమండలి నుంచి వైసీపీ MLCలు వాకౌట్ చేశారు. విజయనగరంలో డయేరియా వ్యాప్తి విషయంలో మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేసినట్లు సభ్యులు ప్రకటించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘సత్యకుమార్ వ్యాఖ్యలు బాధాకరం. సభలో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. ఆయనకు పైశాచిక ఆనందం ఉన్నా సరే, సభలో హుందాగా మెలగాల్సింది’ అంటూ బొత్స ఫైరయ్యారు.