News December 12, 2024
డిసెంబర్ 14న మహారాష్ట్ర క్యాబినెట్ విస్తరణ!
తర్జనభర్జనల అనంతరం మహాయుతిలో CM అభ్యర్థిత్వం కొలిక్కి వచ్చింది. అయితే మంత్రివర్గ విస్తరణలో పీఠముడి వీడడం లేదు. కీలక శాఖల కోసం మిత్రపక్షాలు పట్టుబడుతున్నాయి. మధ్యేమార్గంగా మీకది-మాకిది అన్నట్టుగా శాఖలు పంచుకోవాలని నిర్ణయించాయి. 42 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండడంతో మొత్తంగా BJPకి 21-22, శివసేనకి 12-13, NCPకి 7-8 దక్కవచ్చు. Dec 14న విస్తరణ ఉంటుందని సమాచారం.
Similar News
News January 18, 2025
పూర్తిగా కోలుకున్న విశాల్
ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడిన హీరో విశాల్ పూర్తిగా కోలుకున్నారు. ‘మదగజరాజు’ సక్సెస్ మీట్‌లో నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ కనిపించారు. 12 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి చరిత్ర సృష్టించిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హీరో విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపించారు. సెలబ్రేషన్ ఫొటోలను షేర్ చేశారు.
News January 18, 2025
ఎంపీతో రింకూ ఎంగేజ్‌మెంట్‌లో ట్విస్ట్!
రింకూ సింగ్, SP MP ప్రియా సరోజ్ పెళ్లి ప్రచారంపై ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంకా వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ కాలేదని ప్రియ తండ్రి తుఫానీ సరోజ్ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. రింకూ ఫ్యామిలీ తమ పెద్ద అల్లుడితో మ్యారేజీ ప్రపోసల్ గురించి చర్చించినట్లు ఆయన చెప్పారని తెలిపింది. తమ 2 కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా ఎంగేజ్‌మెంట్ జరిగిందనడంలో నిజం లేదన్నట్లు వెల్లడించింది.
News January 17, 2025
మహాకుంభమేళాలో శ్రీవారికి గంగా హారతి
మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని దశాశ్వమేధ ఘాట్‌లో తిరుమల శ్రీవారికి గంగా హారతిని అర్చకులు సమర్పించారు. శ్రీవారి నమూనా ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోఛ్చారణల నడుమ శ్రీనివాసుడి ప్రతిమను ఘాట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, అధికారులు పాల్గొన్నారు.