News November 25, 2024

మహారాష్ట్ర CM: దేవేంద్ర ఫడణవీస్‌కు నో ఛాన్స్?

image

అంతా ఊహిస్తున్నట్టుగా దేవేంద్ర ఫడణవీస్‌కు CM పీఠం దక్కకపోవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలు మళ్లీ పుంజుకోకుండా వ్యూహాత్మక ఎంపిక ఉంటుందని సమాచారం. ఠాక్రే మరాఠీ, పవార్ మరాఠా అస్థిత్వం ఆధారంగా పార్టీలు నడుపుతున్నారు. ఈ రెండింటినీ న్యూట్రలైజ్ చేసేలా సీఎంను నియమిస్తారని విశ్లేషకుల అభిప్రాయం. మనోహర్, శివరాజ్‌లా కేంద్రంలోకి ఫడణవీస్‌ను తీసుకుంటారన్న వాదనా తెరపైకొచ్చింది.

Similar News

News December 9, 2024

తెలంగాణ అసెంబ్లీ ఈనెల 16 వరకు వాయిదా

image

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 16కు వాయిదా పడ్డాయి. శాసన మండలిని కూడా 16వ తేదీ వరకు వాయిదా వేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో అసెంబ్లీ సమావేశాల తదుపరి కార్యకలాపాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

News December 9, 2024

విచిత్రం.. ఇక్కడ పడమరన సూర్యుడు ఉదయిస్తాడు!

image

సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమరన అస్తమించడం కామన్. అయితే, పడమరన ఉన్న పసిఫిక్ సముద్రంలో సూర్యుడు ఉదయించి తూర్పున ఉన్న అట్లాంటిక్ సముద్రంలో అస్తమించడం మీరెప్పుడైనా చూశారా? ఇలా చూడగలిగే ఏకైక ప్రదేశం పనామా. ఇది సెంట్రల్ అమెరికాలోని ఓ దేశం. ఇక్కడి ఎత్తైన ప్రదేశం వోల్కానో బారుపై నుంచి చూస్తే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు.

News December 9, 2024

‘పుష్ప-2’పై రోజా ప్రశంసలు

image

‘పుష్ప-2’ సినిమాపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఐకాన్ స్టార్.. మీ పుష్ప-2 చిత్రం అంచనాలకు మించింది. పుష్పతో తగ్గేదేలే అన్నారు. Pushpa2తో అస్సలు తగ్గేదేలే అనిపించారు. మా చిత్తూరు యాస వెండితెరపై పలికిన తీరు హాల్‌లో ఈలలు వేయిస్తోంది. మీ నటన అద్భుతం, యావత్ దేశాన్నే మీ మాస్ ఇమేజ్‌తో పుష్పా అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. వైల్డ్ ఫైర్ అని పూనకాలు పుట్టించారు’ అని ట్వీట్ చేశారు.