News October 23, 2024
మహారాష్ట్ర ఎలక్షన్స్: NCP ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది

మహారాష్ట్ర ఎన్నికల్లో NCP దూకుడు ప్రదర్శిస్తోంది. 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశమిచ్చింది. డిప్యూటీ CM, పార్టీ చీఫ్ అజిత్ పవార్ పుణే జిల్లాలోని బారామతి నుంచి బరిలోకి దిగుతున్నారు. సుల్భా ఖోడ్కే (అమరావతి), హిరామన్ ఖోస్కర్ (ఇగత్పురి), భరత్ గవిత్, Dy స్పీకర్ నరహరిజిర్వాల్ (దిండోరి), చగన్ భుజ్‌బల్, రాజ్‌కుమార్ బడోలెకు టికెట్లు దక్కాయి.
Similar News
News December 4, 2025
మోదీ ఒత్తిడికి లొంగే వ్యక్తి కాదు: పుతిన్

PM మోదీ ఒత్తిడికి లొంగే వ్యక్తి కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. భారత్‌పై సుంకాలతో US ఒత్తిడి తెస్తోందా అన్న ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. ‘భారత్ దృఢమైన వైఖరిని ప్రపంచం చూసింది. తమ నాయకత్వం పట్ల దేశం గర్వపడాలి’ అని India Today ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యా-ఇండియా ద్వైపాక్షిక లావాదేవీల్లో 90% పైగా విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. తన ఫ్రెండ్ మోదీని కలుస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
News December 4, 2025
‘స్పిరిట్’ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి: ది ఎపిక్’ స్పెషల్ ప్రీమియర్ కోసం జపాన్‌కు వెళ్లారు. డిసెంబర్ 5, 6న జరిగే ప్రీమియర్స్‌కు ఆయన హాజరవుతారు. డిసెంబర్ 12న ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. ‘కల్కి 2898 AD’ ప్రమోషన్ల సమయంలో జపాన్ అభిమానులను కలవలేకపోయిన ప్రభాస్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈసారి వారిని కలవనున్నారు. దీని కారణంగా ఇటీవల ప్రారంభమైన ‘స్పిరిట్’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.
News December 4, 2025
PG కన్వీనర్ కోటా మిగులు సీట్ల భర్తీకి అనుమతి

AP: PGCET-2025లో కన్వీనర్ కోటాలో మిగులు సీట్ల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. వర్సిటీలు, కాలేజీల్లోని M.A, M.Sc, M.Com తదితర PG సీట్లను సంస్థలు భర్తీచేసుకోవచ్చు. సెట్లో అర్హత సాధించకున్నా, ఆ పరీక్ష రాయకున్నా నిర్ణీత అర్హతలున్న వారితో సీట్లను భర్తీ చేయవచ్చంది. ఈ వెసులుబాటు ఈ ఒక్కసారికే వర్తిస్తుందని పేర్కొంది. కాగా ఇలా చేరిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు వర్తించదని స్పష్టం చేసింది.


