News October 23, 2024

మహారాష్ట్ర ఎలక్షన్స్: NCP ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది

image

మహారాష్ట్ర ఎన్నికల్లో NCP దూకుడు ప్రదర్శిస్తోంది. 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశమిచ్చింది. డిప్యూటీ CM, పార్టీ చీఫ్ అజిత్ పవార్ పుణే జిల్లాలోని బారామతి నుంచి బరిలోకి దిగుతున్నారు. సుల్భా ఖోడ్కే (అమరావతి), హిరామన్ ఖోస్కర్ (ఇగత్‌పురి), భరత్ గవిత్, Dy స్పీకర్ నరహరిజిర్వాల్ (దిండోరి), చగన్ భుజ్‌బల్, రాజ్‌కుమార్ బడోలెకు టికెట్లు దక్కాయి.

Similar News

News November 8, 2024

US ఉపాధ్యక్షుడిగా JD వాన్స్ విచిత్ర రికార్డు

image

US అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా ఆయనకు అత్యంత సన్నిహితుడైన <<13637824>>JD వాన్స్<<>> ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ శతాబ్దంలో ఆయన గడ్డం ఉన్న తొలి ఉపాధ్యక్షుడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. 1933లో మీసాలతో ఉన్న చార్లెస్ కర్టిస్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. చార్లెస్ ఫెయిర్ బ్యాంక్స్ గడ్డం ఉన్న చివరి వైస్‌ప్రెసిడెంట్‌(1905-09)గా నిలిచారు.

News November 8, 2024

గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే

image

పండుగ సీజన్ కావడంతో గత నెలలో భారత వాహన మార్కెట్ మంచి అమ్మకాల్ని నమోదు చేసింది. అత్యధికంగా మారుతీ ఎర్టిగా కారు 18,785 యూనిట్లను విక్రయించింది. 2023 అక్టోబరుతో పోలిస్తే ఇది 32 శాతం వృద్ధి. తర్వాతి స్థానాల్లో స్విఫ్ట్(17,539), క్రెటా(17,497), బ్రెజా(16,565), మారుతీ సుజుకీ ఫ్రాంక్స్(16,419), బలేనో(16,082), టాటా పంచ్(15,470), స్కార్పియో(15,677), టాటా నెక్సాన్(14,759), గ్రాండ్ విటారా(14,083) ఉన్నాయి.

News November 8, 2024

మార్స్‌పై అతి పురాతన మహాసముద్రం.. గుర్తించిన చైనా

image

అంగారకుడిపై కోటానుకోట్ల ఏళ్ల క్రితం మహాసముద్రం ఉండేదని చైనా పరిశోధకులు తేల్చిచెప్పారు. తాము పంపించిన ఝరాంగ్ రోవర్ అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించిందని వారు వెల్లడించారు. ‘మార్స్‌పై ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో నమూనాల ఆధారంగా పురాతన కాలంలో ఓ మహా సముద్రం ఉండేదని గుర్తించాం. సుమారు 3.42 సంవత్సరాల క్రితం ఆ సముద్రం ఎండిపోయింది. ఆ సమయంలో సూక్ష్మ జీవులు అక్కడ మనుగడ సాగించి ఉండొచ్చు’ అని తెలిపారు.