News February 11, 2025
GBS కేసులపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

మహారాష్ట్రలో ఇప్పటివరకు 192 మంది గిలియన్ బార్ సిండ్రోమ్ (<<15225307>>GBS<<>>) అనుమానిత రోగులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 167 మందికి GBS ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. మొత్తం 7 అనుమానిత మరణాలు నమోదయ్యాయని, ఒకరు GBSతో మరణించినట్లు తేలిందని పేర్కొంది. రోగుల్లో 20-29 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
Similar News
News March 15, 2025
‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్ లుక్ చూశారా!

నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ సినిమా ఈ నెల 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఆయన ఫస్ట్ లుక్‌ను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు ‘బౌండరీ నుంచి బాక్సాఫీస్‌కు వస్తున్న వార్నర్‌కు భారత సినిమా పరిశ్రమలోకి స్వాగతం’ అన్న ట్యాగ్‌లైన్‌ను పోస్టర్‌పై జత చేసింది. వార్నర్ లుక్ ఎలా ఉంది? కామెంట్ చేయండి.
News March 15, 2025
గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేశారు: రేవంత్

TG: ప్రభుత్వ ఆలోచనలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలనే గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారని CM రేవంత్ అసెంబ్లీలో అన్నారు. ‘ఏ ప్రభుత్వమైనా ఇదే చేస్తుంది. అది BRS సభ్యులకూ తెలుసు. అయినా గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కార్యకర్త ప్రసంగంలా ఉందని అవహేళన చేశారు. గతంలో మహిళా గవర్నర్‌ను అవమానించిన చరిత్ర వారిది’ అని విమర్శించారు. మరోవైపు KCRపై CM వ్యాఖ్యలను ఖండిస్తూ BRS సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
News March 15, 2025
బీఆర్ఎస్ వల్లే ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్లింది: ఉత్తమ్

TG: కృష్ణా జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరగడానికి కారణమే ఆ పార్టీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ‘ప్రగతిభవన్‌లో జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ విందులు వినోదాలు చేసే సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టారు. గత ప్రభుత్వ పదేళ్ల నిర్లక్ష్యం వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్లింది’ అని ఉత్తమ్ మండిపడ్డారు.