News November 23, 2024
మహారాష్ట్రలో మహాయుతి హవా
మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్‌లో మహాయుతి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ కూటమి మొత్తం 132 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అలాగే మహా వికాస్ అఘాడీ కూటమి 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి గట్టి పోటీ ఇస్తోంది. అలాగే ఝార్ఖండ్‌లోనూ ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది. 33 సీట్లలో ఎన్డీయే కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇండియా కూటమి 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
Similar News
News November 23, 2024
‘మహాయుతి’కి సీఎం చంద్రబాబు విషెస్
AP: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న మహాయుతి కూటమికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం ఏక్నాథ్ శిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు ఆయన ఫోన్ చేసి హర్షం వ్యక్తం చేశారు. కాగా మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఇవాళ సాయంత్రానికి నిర్ణయిస్తారు. శిండే, ఫడణవీస్, అజిత్ ముగ్గురూ సీఎం రేసులో ఉన్నారు.
News November 23, 2024
మహాయుతిని గెలిపించిన ‘హిందూ పోలరైజేషన్’
మహారాష్ట్రలో హిందూ పోలరైజేషన్ భారీగా జరిగినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లోక్‌సభలో BJPని ఓడించేందుకు 90% ముస్లిములు MVAకు ఓటేయడం వారిని ఏకం చేసిందంటున్నారు. వక్ఫ్‌బోర్డు ఆగడాలు, కొందరు ముస్లిం మతపెద్దల హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు, యోగి బటేంగేతో కటేంగే, మోదీ ఏక్ హైతో సేఫ్ హై, ఫడణవీస్ ఓట్ జిహాద్‌ను ఓడించాలన్న పిలుపు ప్రభావం చూపాయన్నారు. పెరిగిన ఓటింగ్ పర్సంటేజీని ఉదాహరణగా చూపుతున్నారు.
News November 23, 2024
ముందంజలో కొనసాగుతున్న స్వరా భాస్కర్ భర్త
మహారాష్ట్రలోని అనుశక్తి నగర్ అసెంబ్లీ స్థానం నుంచి నటి స్వర భాస్కర్ భర్త, NCP SP అభ్యర్థి ఫహద్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి, నవాబ్ మాలిక్ కూతురు సనా మాలిక్‌పై 4 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చెందిన ఆచార్య నవీన్ విద్యాధర్ 17,553 ఓట్లతో వెనుకబడి మూడో స్థానంలో నిలిచారు. 2019లో ఉమ్మడి ఎన్సీపీ అభ్యర్థిగా నవాబ్ మాలిక్ 65 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.