News November 23, 2024
మహారాష్ట్రలో మహాయుతి హవా
మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్‌లో మహాయుతి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ కూటమి మొత్తం 132 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అలాగే మహా వికాస్ అఘాడీ కూటమి 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి గట్టి పోటీ ఇస్తోంది. అలాగే ఝార్ఖండ్‌లోనూ ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది. 33 సీట్లలో ఎన్డీయే కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇండియా కూటమి 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
Similar News
News December 11, 2024
బుమ్రాకు పెద్ద గాయం..?
BGTని దక్కించుకోవాలంటే టీమ్ ఇండియాకు బుమ్రా కీలకం. అందుకే రెండో టెస్టులో ఆయన గాయపడటం అభిమానుల్ని కలవరపెట్టింది. అది చిన్నగాయమేనని టీమ్ మేనేజ్‌మెంట్ కొట్టిపారేసినప్పటికీ.. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ డేమియన్ ఫ్లెమింగ్ మాత్రం కాకపోవచ్చంటున్నారు. ‘అది తీవ్రగాయంలాగే కనిపిస్తోంది. బుమ్రా చివరి ఓవర్ కష్టంగా పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రేక్‌లో ఇబ్బంది పడ్డారు. వేగం కూడా చాలా తగ్గింది’ అని తెలిపారు.
News December 11, 2024
కేసీఆర్ దీక్ష, ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ: హరీశ్
TG: కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర దీక్షకు దిగగా ఆయనను జైలులో పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని హరీశ్ రావు అన్నారు. జైలులో దీక్ష కొనసాగిస్తే కాంగ్రెస్ దిగొచ్చి డిసెంబర్ 9న ప్రకటన చేసిందన్నారు. కేసీఆర్ దీక్ష, ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పారు. ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రాజీనామా చేయకుండా పారిపోయారని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఈ CM ఎక్కడున్నారని ప్రశ్నించారు.
News December 11, 2024
APకి రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
APకి రూ.4లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయని కలెక్టర్ల సదస్సులో CM చంద్రబాబు వెల్లడించారు. వీటితో 4లక్షల ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.31వేల కోట్లు సమకూర్చామని, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. గ్రామసభల ద్వారా తలపెట్టిన అభివృద్ధి పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతాయన్నారు.