News January 15, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’పై మహేశ్ బాబు ప్రశంసలు

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు వీక్షించినట్లు ట్వీట్ చేశారు. ‘సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశాం. ఇది పర్‌ఫెక్ట్ ఫెస్టివల్ ఫిల్మ్. వెంకటేశ్ అదరగొట్టారు. నా డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస బ్లాక్ బస్టర్లు కొట్టడం గర్వంగా ఉంది. హీరోయిన్లు ఐశ్వర్య, మీనాక్షి చౌదరి నటన అదుర్స్. బుల్లి రాజు క్యారెక్టర్ అదిరిపోయింది. చిత్రయూనిట్‌కు అభినందనలు’ అని మహేశ్ ట్వీట్ చేశారు.

Similar News

News February 18, 2025

నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

image

ఎల్‌నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక APలో సాధారణం కంటే 2-4డిగ్రీలు గరిష్ఠంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువని అంచనా.

News February 18, 2025

నేడు కుంభమేళాకు పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ యూపీలోని ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. నిన్న మంత్రి నారా లోకేశ్ దంపతులు కూడా కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే.

News February 18, 2025

పార్టీ ఫిరాయింపుల కేసు.. నేడు సుప్రీంలో విచారణ

image

TG: తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్‌ పార్టీ గత నెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారించనుంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై స్పెషల్ లీవ్ పిటిషన్, మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ దాఖలు చేసింది.

error: Content is protected !!