News July 31, 2024

మహేశ్‌బాబు నాకెప్పుడూ సపోర్ట్ చేస్తారు: సుధీర్‌బాబు

image

సినిమా సక్సెస్ కాకపోతే తన కంటే కుటుంబమే ఎక్కువ బాధపడుతుందని హీరో సుధీర్‌బాబు వెల్లడించారు. ముఖ్యంగా బావ మహేశ్‌బాబు ఎక్కువ ఆందోళన పడతారని, ఆయన తనకెప్పుడూ సపోర్ట్ చేస్తుంటారని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా కోసం సూపర్ స్టార్ పడే శ్రమ చూస్తే తన కష్టం చిన్నదనిపిస్తుందన్నారు. ప్రతి సినిమా ప్రేక్షకుల్ని మెప్పించేలా గొప్పగా ఉండేందుకు శ్రమిస్తానని తెలిపారు.

Similar News

News April 6, 2026

‘లాకప్ డెత్’.. అప్పట్లో దేశాన్ని కుదిపేసిన కేసు

image

TNలోని మదురై <<19583236>>కోర్టు<<>> తీర్పుతో లాకప్‌డెత్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. లాక్‌డౌన్‌లో షాప్స్ త్వరగా మూసివేయిస్తున్నారని జయరాజ్ చేసిన విమర్శతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నించిన కొడుకునీ లాకప్‌లో వేసి హింసించడంతో వారు చనిపోయారు. దీనిని పోలీసులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నించగా నిరసనలు చెలరేగడంతో కేసును CBI టేకోవర్ చేసింది. ఐదేళ్లలో 100 మందికిపైగా సాక్షులను విచారించి కోర్టు ఈ తీర్పునిచ్చింది.

News April 6, 2026

‘అమృత్’ స్కీమ్‌లోకి పిఠాపురం.. థాంక్స్ చెప్పిన పవన్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించిందని, ఆయన అభ్యర్థన మేరకు ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్‌ను చేర్చారని Dy.CMO ట్వీట్ చేసింది. పథకంలో భాగంగా రూ.37.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారని తెలిపింది. దీంతో పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు పవన్ ధన్యవాదాలు తెలిపారు.

News April 6, 2026

పెళ్లి చేసుకొన్న మహిళా క్రికెటర్లు

image

మహిళా క్రికెటర్లు అమీ జోన్స్(ఇంగ్లండ్), పైపా క్లియరీ(ఆస్ట్రేలియా) పెళ్లి చేసుకొన్నారు. ఈ నెల 4న తమ వివాహం జరిగినట్లు వారు ఇన్‌స్టాలో పోస్టు చేశారు. 2024 జులైలో వారి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అమీ 8 టెస్టులు, 111 వన్డేలు, 125 టీ20లు, క్లియరీ 109 టీ20లు ఆడారు. కాగా గతంలోనూ పలువురు ఉమెన్ క్రికెటర్లు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకొన్న విషయం తెలిసిందే.