News July 31, 2024
మహేశ్‌బాబు నాకెప్పుడూ సపోర్ట్ చేస్తారు: సుధీర్‌బాబు

సినిమా సక్సెస్ కాకపోతే తన కంటే కుటుంబమే ఎక్కువ బాధపడుతుందని హీరో సుధీర్‌బాబు వెల్లడించారు. ముఖ్యంగా బావ మహేశ్‌బాబు ఎక్కువ ఆందోళన పడతారని, ఆయన తనకెప్పుడూ సపోర్ట్ చేస్తుంటారని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా కోసం సూపర్ స్టార్ పడే శ్రమ చూస్తే తన కష్టం చిన్నదనిపిస్తుందన్నారు. ప్రతి సినిమా ప్రేక్షకుల్ని మెప్పించేలా గొప్పగా ఉండేందుకు శ్రమిస్తానని తెలిపారు.
Similar News
News January 24, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 24, 2026
కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు అరెస్ట్!

ముంబైలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌పై కాల్పులు జరిగిన ఘటనలో బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్(KRK)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైరింగ్ చేసిన తుపాకీని సీజ్ చేశారు. తన లైసెన్స్‌డ్ గన్ నుంచి తానే కాల్పులు జరిపినట్లు ఆయన ఒప్పుకున్నారు. గన్‌ని క్లీన్ చేశాక టెస్ట్ చేసేందుకు 4 రౌండ్స్ ఫైర్ చేసినట్లు తెలిపారు. జనవరి 18న ఘటన జరగ్గా పోలీసులు దర్యాప్తు చేసి ఫైరింగ్ జరిపింది KRKగా గుర్తించారు.
News January 24, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 24, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.31 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.07 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.22 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


