News August 10, 2024
మహేశ్ బాబు మనసు బంగారం

మహేశ్బాబు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా సొంతూరు బుర్రిపాలెంలో నిన్న మహేశ్బాబు ఫౌండేషన్ మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించింది. 155 మందికి డాక్టర్లు వైద్యం చేసి, మందులు పంపిణీ చేశారు. ఇది 41వ క్యాంపు అని నిర్వాహకులు తెలిపారు. దీంతో సూపర్ స్టార్ మనసు బంగారమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆయన ఎంతో మంది పిల్లలకు గుండె సర్జరీలు <<13811914>>చేయించిన<<>> విషయం తెలిసిందే.
Similar News
News December 24, 2025
గాంజాపై సమరం.. అవగాహన సదస్సులు నిర్వహించాలి: నల్గొండ కలెక్టర్

విద్యార్థులు గాంజా వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీస్ అధికారుల సమన్వయంతో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.
News December 24, 2025
Money Tip: మీ జీతంలో EMIల వాటా ఎంత?

ప్రతినెలా సంపాదించే మొత్తంలో అప్పుల వాటా ఎంత ఉండాలో చెప్పేదే 40% EMI రూల్. ఇంటి అద్దె, తిండి, ఇతర ఖర్చులు పోనూ.. చేతికి వచ్చే ఆదాయంలో 40 శాతానికి మించి EMIలు ఉండకుండా చూసుకోవాలి. లేదంటే మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. హోం, పర్సనల్, కార్ లోన్లు.. అన్నీ కలిపి ఈ పరిమితిలోపే ఉండాలి. అప్పుల భారం తగ్గించుకుంటేనే ప్రశాంతంగా ఉండగలరు. పొదుపు పెంచుకోవడానికి ఈ సూత్రం ఎంతో ఉపయోగపడుతుంది.
News December 24, 2025
పడమర దిశలో తల పెట్టి నిద్రపోతున్నారా?

ఆరోగ్యంగా ఉండాలంటే సరైన దిశలో నిద్రపోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పడమర దిశలో తల పెట్టి, తూర్పు వైపు కాళ్లు చాపి పడుకుంటే మగత నిద్ర వస్తుందని, ఇది అనారోగ్యానికి కారణమవుతుందని అంటున్నారు. ‘ఈ దిశలో నిద్రిస్తే పీడకలలు, అర్ధరాత్రి మెలుకువ రావడం వంటి సమస్యలు రావొచ్చు. సరైన నిద్ర లేకపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. పనులపై అనాసక్తి, నిరుత్సాహం కలుగుతాయి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


