News June 29, 2024
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా?
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్హా నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం CRPFలో ఐజీగా కొనసాగుతున్న ఆయన.. కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని రెండు రోజుల్లో ఏపీకి రానున్నారు. గతంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా, చింతపల్లి ఏఎస్పీగా, ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాల ఎస్పీగా, విశాఖ సీపీగా పని చేశారు. NIAలోనూ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు.
Similar News
News October 7, 2024
మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ
ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించేందుకు అవసరమైన చర్యలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు, విజయవాడలోని బుడమేరు వాగు ప్రక్షాళన, వరద నష్టంపై చర్చించినట్లు తెలుస్తోంది.
News October 7, 2024
దారుణం.. ప్రియుడి కోసం 13 మందిని చంపింది!
పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఓ యువతి తన పేరెంట్స్ సహా 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. పక్కా ప్లాన్ ప్రకారం ఆహారంలో విషం కలిపింది. అది తిన్న వెంటనే 13 మంది తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు యువతితో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.
News October 7, 2024
2047 నాటికి ‘వికసిత్ భారత్’ను మనందరం చూస్తాం: పవన్
గుజరాత్ CMగా మోదీ ప్రమాణం చేసి నేటికి 23ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు AP Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘విప్లవాత్మక నిర్ణయాలతో కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చడం ఆరోజు మొదలైంది. ఆయన నాయకత్వంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో దూసుకుపోతూ, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను మనం చూస్తామని నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు.