News January 28, 2025

ఎన్టీఆర్ సినిమాకు మరోసారి మహేశ్ వాయిస్?

image

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘వార్-2’ చిత్రానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హిందీలో రణ్‌బీర్ కపూర్ ఇస్తారని తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇప్పటికే ‘బాద్ షా’ సినిమాకు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News February 19, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 19, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ కావాలి: CM చంద్రబాబు
* ఎవరినీ వదిలిపెట్టం.. బట్టలు ఊడదీసి నిలబెడతాం: YS జగన్
* చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది: YCP
* విభజన హామీలను పవనే సాధించాలి: ఉండవల్లి
* సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్‌గా ఉంచుతాం: రేవంత్
* రేవంత్ నిజాయితీగల మోసగాడు: KTR

News February 19, 2025

MLC ఎన్నికలు.. పదేపదే కాల్స్‌తో తలనొప్పి!

image

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏపీలో ఉభయ గోదావరి-గుంటూరు, కృష్ణా, తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. కొత్త కొత్త నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ మద్దతు అడుగుతున్నారని.. రోజుకు 10 కాల్స్ వస్తే 7-8 కాల్స్ వాళ్లవే అని అసహనానికి గురవుతున్నారు. మరి మీకూ కాల్స్ వస్తున్నాయా?

error: Content is protected !!