News July 10, 2024
XUV 700పై మహీంద్రా భారీ తగ్గింపు
ఎక్స్‌యూవీ 700 AX7 విడుదలై మూడేళ్లు పూర్తైన సందర్భంగా భారీ డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. గతంలో AX7 వేరియెంట్ ధర రూ.21.54 లక్షలుగా ఉండగా ఇప్పుడు రూ.19.49 లక్షలకే అందివ్వనున్నట్లు తెలిపింది. మంగళవారం నుంచే ఈ కొత్త ధర అందుబాటులోకి వచ్చిందని, 4 నెలలపాటు మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఎంపిక చేసిన వేరియెంట్లపై రూ. 2.2 లక్షల వరకు తగ్గింపు లభిస్తుందని స్పష్టం చేసింది.
Similar News
News October 13, 2024
ఇరాన్ అణు స్థావరాలపై సైబర్ అటాక్?
ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైబర్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖల సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. తమ విలువైన డాటా చోరీకి గురైనట్లు ఇరాన్ కూడా వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరపొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
News October 13, 2024
మరోసారి నిరాశపర్చిన అభిషేక్ శర్మ
టీమ్ ఇండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచారు. ఈ సిరీస్‌లో అభి వరుసగా 16, 15, 4 పరుగులే చేశారు. దీంతో అంచనాలకు తగ్గట్లుగా అతడు రాణించలేకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో వచ్చిన ఛాన్స్‌లను ఆయన వృథా చేసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇలాగే ఆడితే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. మరోసారి జట్టులో చోటు దక్కడం కష్టమని చెబుతున్నారు.
News October 13, 2024
అక్టోబర్ 13: చరిత్రలో ఈ రోజు
1679: పెను తుపానుతో మచిలీపట్నం ప్రాంతంలో 20 వేల మందికి పైగా మృతి
1965: హాస్య నటి కల్పనా రంజనీ జననం
1973: కవి, గీత రచయిత కందికొండ యాదగిరి జననం
1987: బాలీవుడ్ నటుడు కిషోర్ కుమార్ మరణం
1990: హీరోయిన్ పూజా హెగ్డే జననం
1993: టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి జననం
ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం