News June 15, 2024

టాటా మోటార్స్‌ను వెనక్కు నెట్టిన మహీంద్రా

image

దేశంలో రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా మహీంద్రా అండ్ మహీంద్రా నిలిచింది. మార్కెట్ విలువ పరంగా టాటా మోటార్స్(₹3.29L cr)ను వెనక్కు నెట్టింది. మారుతీ సుజుకీ ఇండియా(₹4.04L cr) మొదటి స్థానంలో ఉండగా, మహీంద్రా (₹3.63L cr) సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఈ ఏడాది మహీంద్రా స్టాక్ 65% పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ ఏడాదిలోనే ₹2L cr పెరిగింది.

Similar News

News September 14, 2024

కోహ్లీతో పోరాటం కోసం ఎదురుచూస్తున్నా: స్టార్క్

image

ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీకి బౌలింగ్ వేసేందుకు ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అన్నారు. విరాట్‌తో పోరాటం బాగుంటుందన్నారు. ‘మేమిద్దరం ఒకరితో ఒకరు చాలా క్రికెట్ ఆడాం. మా పోరాటంలో ఉండే మజాను ఆస్వాదిస్తుంటాను. తను నాపై రన్స్ చేశారు. నేనూ ఆయన్ను ఔట్ చేశాను. ఈసారి పోరు ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు.

News September 14, 2024

గుజరాత్‌లో తీవ్ర విషాదం

image

గుజరాత్‌లోని దేగాం తాలూకాలో జరిగిన వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు నీటిలో మునిగి చనిపోయారు. వస్నా సోగ్తికి చెందిన కొందరు యువకులు గణేషుడిని నిమజ్జనం చేసేందుకు మాషో నదికి వెళ్లారు. నిమజ్జనం అనంతరం ఓ యువకుడు ఈత కొడుతూ మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు ఒకరి తర్వాత మరొకరు నీటిలో దూకి మునిగిపోయారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

News September 14, 2024

సెప్టెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

1883: స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జననం
1923: ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ జననం
1958: అవధాని గరికపాటి నరసింహారావు జననం
1962: సినీ నటి మాధవి జననం
1967: హైదరాబాద్ మాజీ సీఎం బూర్గుల రామకృష్ణారావు మరణం
1990: టీమ్ ఇండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ జననం
హిందీ భాషా దినోత్సవం