News October 2, 2024

2 లక్షల మార్కుకు చేరువగా మహీంద్రా థార్

image

నాలుగేళ్ల క్రితం లాంచ్ అయిన మహీంద్రా థార్ వాహన ప్రియుల్లో మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగేళ్లలో 1.90 లక్షల వాహనాలను విక్రయించినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ముగిసేలోపు 2 లక్షల మార్కును దాటేస్తామని ధీమా వ్యక్తం చేసింది. థార్‌ త్రీ-డోర్ వాహనం కాగా.. ఐదు తలుపులతో కూడిన థార్ రాక్స్‌ను మహీంద్రా ఈ ఏడాది తీసుకొచ్చింది. దానికీ అమ్మకాలు భారీగానే ఉండటం విశేషం.

Similar News

News December 11, 2025

తొగిట: పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

హవేలీ ఘనపూర్ మండలం ఎన్నికల కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ మండల తహశీల్దార్ సింధూ రేణుకతో కలిసి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందన్నారు. ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News December 11, 2025

ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్

image

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మ.2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, సా.5గంటలలోపు ఫలితాలు వచ్చే అవకాశముంది. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది, 27,628 వార్డుల్లో 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రామాల అధిపతులెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.
-కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ వే2న్యూస్‌లో

News December 11, 2025

1950+ విమానాలను నడుపుతున్నాం: ఇండిగో

image

ఇవాళ 1,950కి పైగా విమానాలను నడుపుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. 138 గమ్యస్థానాలకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపింది. నెట్‌వర్క్‌ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొంది. డిసెంబర్ 8 నుంచి ఇండిగోలో నెట్‌వర్క్ సమస్యలు తలెత్తి వందలాది ఫ్లైట్‌లు రద్దయిన విషయం తెలిసిందే.