News September 23, 2024
మహీంద్రా థార్ రాక్స్ తొలి కారు వేలం.. ఎంత పలికిందంటే..

మహీంద్రా సంస్థ తమ థార్ కారుకు అప్‌డేట్‌గా థార్ రాక్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో తయారుచేసిన తొట్టతొలి కారును ఛారిటీ కోసం తాజాగా వేలం వేయగా ఏకంగా రూ.1.31 కోట్లకు అమ్ముడుపోయింది. VIN 0001 ఛాసిస్ నంబర్ కలిగిన ఈ కారు AX7 L డీజిల్ 4×4 టాప్ వేరియెంట్. ఆనంద్ మహీంద్రా సంతకం ఈ కారుకు మరో ప్రత్యేకత. రాక్స్ బేస్ వేరియెంట్ ఆన్‌రోడ్ ధర రూ.16 లక్షలుగా ఉంది.
Similar News
News February 12, 2026
బాల భీముడు.. 5.20KGల బరువుతో జననం

TG: సాధారణంగా నవజాత శిశువులు పుట్టగానే 2.5-3.5 కిలోల బరువుంటారు. కొన్నిచోట్ల 4 కేజీల బరువుతోనూ జన్మించారు. అయితే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సంధ్యారాణి అనే మహిళ సీ సెక్షన్ ద్వారా 5.20 కేజీల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ బాల భీముడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
News February 12, 2026
కూరగాయ పంటల్లో తెగుళ్లు- కట్టడి సూచనలు

☛ అన్ని కూరగాయ పంటల్లో అక్షింతల పురుగు, చిత్తపురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 2మి.లీ కలిపి పిచికారీ చేయాలి. వంగ, కాకర, ఆగాకర పంటలకు మాత్రం లీటరు నీటికి థయోడికార్బ్ 1 గ్రాము కలిపి పిచికారీ చేసుకోవాలి.
☛ మిరప, టమాటా, క్యాబేజీ వంటి పంటల్లో ఎండుతెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మెటాలాక్సిల్ + మాంకోజెబ్ 2గ్రా. కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.
News February 12, 2026
హలో అనేందుకు మంత్రుల హడల్

తెలంగాణలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్న మంత్రి పొంగులేటి ఆరోపణ బాంబు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ టూల్స్‌తో BRS ట్యాప్ చేయిస్తుందేమోనని అనుమానిస్తున్న మంత్రులు నార్మల్ కాల్స్ ఆన్సర్ చేయడం లేదు. కొందరు మినిస్టర్స్ కొన్ని కాల్స్ అటెంప్ట్ చేసినా పైపై మాటలే. డీటెయిల్స్ జోలికి వెళ్లడం లేదు. ముఖ్య విషయాలు డిస్కస్ చేసేందుకు వాట్సాప్ కాల్ లేదా యాపిల్ ఫేస్ టైం వాడుతున్నారని సమాచారం.


