News November 11, 2024

వయనాడ్‌‌లో మైకులు బంద్.. 13న ఉపఎన్నిక

image

వ‌య‌నాడ్ లోక్‌స‌భ స్థానానికి జ‌రుగుతున్న ఉపఎన్నిక‌లో పార్టీల ప్ర‌చార ప‌ర్వానికి నేటి సాయంత్రంతో తెర‌ప‌డింది. బుధ‌వారం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. చివ‌రి రోజు UDF అభ్యర్థి, సోద‌రి ప్రియాంక‌తో క‌లిసి రాహుల్ గాంధీ సుల్తాన్ బ‌తెరిలో ప్రచారం చేశారు. వయనాడ్‌ను ఉత్తమ పర్యాటక ప్రాంతంగా నిలిపేందుకు ప్రియాంకకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అటు LDF నుంచి స‌త్యం మోకెరి, NDA నుంచి న‌వ్య హ‌రిదాస్ బ‌రిలో ఉన్నారు.

Similar News

News December 8, 2024

ప్రభుత్వం ఏడాదిలో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో ఇళ్లను కూల్చిందని, కానీ ఒక్క ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2,500 వంటి హామీలను అమలు చేయలేదని అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారని, కానీ బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

News December 8, 2024

‘అతడు’ స్టైల్ దొంగ.. DNA టెస్టులో దొరికేశాడు!

image

రాజు అనే ఘరానా <<14738630>>దొంగ<<>> ‘అతడు’ మూవీలో మహేశ్‌బాబు లాగా కుమారుడు తప్పిపోయిన ఇంటికి వెళ్తాడు. ఆపై తనదైన శైలిలో దోపిడి చేసి పరారవుతాడు. ఇలా రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లోని ఇళ్లలో దొంగతనాలు చేశాడు. ఇటీవల ఢిల్లీలోని ఖోడా ఏరియాకు చెందిన తులారాం ఇంటికి అలాగే వెళ్లాడు. ఆస్తులపై కుటుంబీకులను ఆరా తీయగా వారు అనుమానించి పోలీసులకు చెప్పారు. DNA టెస్టులో తులారాంకు సంబంధం లేదని తేలడంతో అరెస్ట్ చేశారు.

News December 8, 2024

రేపు, ఎల్లుండి పింఛన్ల తనిఖీ

image

AP: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది. తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు, ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించనుంది. ఒక్కో బృందం 40 పింఛన్లను పరిశీలిస్తుంది.