News May 10, 2024
రాష్ట్రంలో మెజార్టీ సీట్లు బీజేపీకే: కిషన్ రెడ్డి

TG: BRSపై వ్యతిరేకతతోనే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారని BJP రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని తెలిపారు. విభజన హామీల గురించి మాట్లాడే నైతిక హక్కు KCRకు లేదని మండిపడ్డారు. మోదీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో తమకే మెజార్టీ సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News February 19, 2025
దారుణం.. బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్

తమిళనాడు కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. కునియముత్తూరులో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటున్న బాలికకు సోషల్ మీడియాలో ఓ కాలేజీ విద్యార్థితో పరిచయమైంది. ఆమెను నమ్మించి తన గదికి రప్పించుకున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆరుగురు స్నేహితుల్ని ఆమెపైకి ఉసిగొల్పి పైశాచిక ఆనందం పొందాడు. నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
News February 19, 2025
రేవంత్‌కు రూ.4.20 లక్షల కోట్లు జరిమానా వేసినా తప్పులేదు: కేటీఆర్

TG: అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌కు జరిమానా వేయాలని కేటీఆర్ అన్నారు. సింగపూర్ పార్లమెంట్లో రెండు అబద్ధాలు చెప్పినా ఫైన్ వేశారని ఓ ఆర్టికల్‌ను కేటీఆర్ చేశారు. కాళేశ్వరం గురించి, రాష్ట్ర అప్పులు, హామీల గురించి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 420 అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి రూ.4.20 లక్షల కోట్ల జరిమానా వేసినా తప్పులేదని అన్నారు.
News February 19, 2025
RTCలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్

APSRTCలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.10లక్షల ప్రమాద బీమా వర్తించనుంది. అద్దె బస్సులు, ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, బస్సుల్లో అటెండర్లు, బస్టాండ్లు, గ్యారేజీలు, స్వీపర్లు, గైడ్లు, కౌంటర్లలో బస్ టికెట్లు జారీ చేసే సిబ్బందికి ఇది వర్తించనుంది. దీనికి వారిని నియమించుకున్న కాంట్రాక్టర్ ఒక్కొక్కరికి రూ.499 చొప్పున పోస్టల్ శాఖ అంత్యోదయ శ్రామిక్ సురక్ష యోజన బీమాకు ప్రీమియం చెల్లించాలి.