News January 14, 2025

మరికాసేపట్లో మకరజ్యోతి

image

మరికాసేపట్లో శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తరించేందుకు అయ్యప్ప మాలధారులు, భక్తులు భారీగా శబరిమలకు చేరుకున్నారు. భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

Similar News

News February 15, 2025

ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ ఫీచర్!

image

సోషల్ మీడియా దిగ్గజం ‘ఇన్‌స్టాగ్రామ్’లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. రెడ్డిట్‌లో అప్‌ఓట్, డౌన్‌ఓట్ ఉన్నట్లు ఇన్‌స్టాలోనూ పోస్టు కింద చేసిన కామెంట్ నచ్చకపోతే డిస్ లైక్ చేసే ఫీచర్ తీసుకొచ్చేందుకు ‘మెటా’ యోచిస్తోంది. యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి దీనిని తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇన్‌స్టా కామెంట్ సెక్షన్‌లో లవ్(లైక్) బటన్ మాత్రమే ఉంది.

News February 15, 2025

మార్చిలోపు ఆ ఆస్తుల లెక్కలు తేల్చండి: బండి

image

TG: ‘ఎనిమీ ప్రాపర్టీస్’పై అధికారులతో కేంద్రమంత్రి బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. భారత్ నుంచి వెళ్లి పాక్, చైనాలో స్థిరపడ్డవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. మార్చిలోపు లెక్కలు తేల్చాలన్నారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఈ ఆస్తులున్నట్లు గుర్తించారు. పాక్, చైనాలో సెటిలైన భారతీయుల ఆస్తులను కేంద్రం ఎనిమీ ప్రాపర్టీస్ చట్టం కింద స్వాధీనం చేసుకుంటుంది.

News February 15, 2025

SBI: లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్

image

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, రిటైల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గినట్లు తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునేవారికి ఇది మంచి అవకాశమని పేర్కొంది. ఎంసీఎల్ఆర్, బీపీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది.

error: Content is protected !!