News February 4, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టులో మార్పులు చేయండి: అశ్విన్

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలని మాజీ ప్లేయర్ అశ్విన్ సూచించారు. ఇంగ్లండ్‌తో టీ20ల్లో వరుణ్ ప్రదర్శన అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు వన్డేల్లో అరంగేట్రం చేయని వరుణ్‌కు ఎల్లుండి నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో అవకాశమివ్వాలని అభిప్రాయపడ్డారు. కాగా CTకి ప్రకటించిన భారత జట్టులో తుది మార్పులకు ఫిబ్రవరి 11వరకు అవకాశముంది.
Similar News
News February 8, 2025
EC డేటా: BJP 40, AAP 30

ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తం 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్ 36 కన్నా ఇది 7 స్థానాలు ఎక్కువ. ఆమ్‌ఆదీ పార్టీ 30 సీట్లతో ముందుకు సాగుతోంది. బీజేపీ ఓట్ షేరు 48.03 శాతంగా ఉంది. ఆప్ 42.58 శాతం సాధించింది. కాంగ్రెస్‌కు 6.74% ఓట్‌షేర్ రావడం గమనార్హం.
News February 8, 2025
Delhi Results: ఇండీ కూటమిపై ఒమర్ అబ్దుల్లా విమర్శలు

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఘోర ఓటమి దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండీ కూటమిపై విమర్శలు గుప్పించారు. రామాయణం సీరియల్‌కు సంబంధించిన జిఫ్‌ను షేర్ చేశారు. ‘జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి. ఒకరినొకరు అంతం చేసుకోండి’ అని అందులో ఉంది. ఇండియా కూటమి పార్టీలు కొట్లాడుకుంటుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ పరోక్షంగా విమర్శించారు.
News February 8, 2025
ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే

ఢిల్లీలోని ముస్లిం ఆధిపత్య 7 నియోజకవర్గాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శించడానికి ఆ పార్టీ ముస్లిం మోర్చా ‘సైలెంట్ క్యాంపెయిన్’ బాగా హెల్ప్ చేసింది. వీరు 4-7 సభ్యుల బృందాలుగా విడిపోయి ప్రతి ఇంటికీ తిరిగారు. ‘లాభార్థి యోజనా’ ఫామ్స్ పేరుతో వివరాలు సేకరిస్తూ ఆప్‌పై ఆగ్రహాన్ని గమనించారు. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో 70-80 చిన్న చిన్న మీటింగ్స్ పెట్టి తమకు అవకాశం ఇవ్వాలని కోరడం కలిసొచ్చినట్టు తెలుస్తోంది.