News July 10, 2024
ఆ పరీక్షల మధ్య గ్యాప్ ఉండేలా చూడండి: కోదండరాం
TG: డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య వ్యవధి ఉండేలా చూడాలని TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డిని టీజేఎస్ అధినేత కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. అలా అయితేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై తాము క్రియాశీలకంగానే ఉన్నామని చెప్పారు. మరోవైపు డీఎస్సీ వాయిదా వేయాలని అభ్యర్థులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News October 6, 2024
మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే
ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయన్నారు. ఈ సుముహూర్తాల్లో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని, దాదాపు రూ.6 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నారని CAIT అంచనా వేస్తోంది.
News October 6, 2024
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరివురు హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
News October 6, 2024
డీఎస్సీ సర్టిఫికెట్ పరిశీలన పూర్తి
TG: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఒక్కో ఉద్యోగానికి 1:3 చొప్పున 25,924 మందిని వెరిఫికేషన్‌కు పిలవగా 24,466 మంది హాజరయ్యారు. మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ కోటాలో టీచర్ పోస్టులకు కొన్ని జిల్లాలో వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. కాగా డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈ నెల 9న LB స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందజేయనున్నారు.