News September 13, 2024

మూత్రం, మురుగు నీటి నుంచి బీర్‌ తయారీ!

image

సింగపూర్‌లో న్యూబ్రూ అనే కంపెనీ బీర్‌ను తయారుచేస్తుంటుంది. ఆ బీర్ రుచి ఇతర కంపెనీల మాదిరిగానే ఉన్నా వాస్తవంగా మూత్రం, మురుగునీటి నుంచి శుద్ధి చేసిన నీటి నుంచి దాన్ని తయారు చేస్తున్నారు. సింగపూర్‌ ప్రభుత్వం దేశ డ్రైనేజీల్ని రీసైకిల్ చేసి ‘నెవాటర్‌’ అనే తాగునీటిని ఉత్పత్తి చేస్తోంది. ఆ నీటినే న్యూబ్రూ వాడుతోంది. తయారీలో అంతర్జాతీయ ప్రమాణాల్ని అనుసరిస్తున్నామని సంస్థ వినియోగదారులకు హామీ ఇస్తోంది.

Similar News

News October 7, 2024

ఇవాళ రా.9 నుంచి ఘాట్‌రోడ్డులో బైక్, ట్యాక్సీలపై నిషేధం

image

AP: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు శ్రీవారికి కీలకమైన గరుడవాహన సేవ జరగనుంది. ఈ వేడుకను వీక్షించేందుకు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో వాహన రద్దీని నియంత్రించడానికి ఇవాళ రా.9 నుంచి ఎల్లుండి ఉ.6 గంటల వరకు బైకులు, ట్యాక్సీలకు ఘాట్ రోడ్డులో అనుమతిని నిరాకరించారు. రేపు సా.6.30 నుంచి రా.11 గంటల వరకు మలయప్పస్వామి గరుడ వాహనంపై విహరించనున్నారు.

News October 7, 2024

వ్యోమగాముల ఆహారంగా గ్రహశకలాలు

image

దీర్ఘకాల స్పేస్ మిషన్లలో వ్యోమగాముల ఆహార అవసరాలు తీర్చడానికి సైంటిస్టులు కొత్త పద్ధతిపై అధ్యయనం చేస్తున్నారు. ‘పైరోలిసిస్’ ప్రక్రియతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి తినదగిన ఆహారంగా మార్చొచ్చు. ఇదే తరహాలో గ్రహశకలాల నుంచి కార్బన్‌ను సంగ్రహించి పోషకాలుగా మార్చడంపై పనిచేస్తున్నారు. భూమిపై పడిన ఉల్కలపై సూక్ష్మజీవులు వృద్ధి చెందడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది.

News October 7, 2024

ఈ ఏడాది SBIలో 10,000 ఉద్యోగాలు

image

ప్రభుత్వరంగ బ్యాకింగ్ దిగ్గజం SBI ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా దాదాపు 10,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఎంట్రీ లెవెల్ నుంచి హైలెవెల్ వరకు దాదాపు 1,500 మంది టెక్నికల్ సిబ్బంది నియామకానికి ఇటీవల ఉద్యోగ ప్రకటన చేశామన్నారు. కొత్త ఉద్యోగాల్లో డేటా సైంటిస్టులు, డేటా ఆర్కిటెక్ట్స్, నెట్‌వర్క్ ఆపరేటర్స్ వంటివి ఉన్నట్లు తెలిపారు.