News September 14, 2024
అప్పుల ఊబిలో మాల్దీవులు.. చైనాతో కీలక ఒప్పందం
పొరుగుదేశం మాల్దీవులు అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆ దేశం చైనా నుంచి మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తమ మిత్ర దేశం మాల్దీవులకు తాము ఎలాంటి సహకారమైనా అందిస్తామని చైనా ప్రకటించింది. కాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు త్వరలో భారత్ పర్యటనకు రానున్న క్రమంలో ఈ అగ్రిమెంట్ జరగడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News October 5, 2024
నిరాహార దీక్షకు ఆర్‌జీ కర్ వైద్యుల నిర్ణయం
కోల్‌కతాలోని RG కర్ ఆస్పత్రి జూనియర్ వైద్యులు 24గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తాజాగా ప్రకటించారు. ఓవైపు తమ విధులు నిర్వహిస్తూనే ధర్మతల మెట్రో ఛానల్ ప్రాంతంలో నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. దుర్గాపూజ సమయంలోనూ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ఆస్పత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించడంపై ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు తీసుకోకుంటే వైద్య సేవల్ని మళ్లీ నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
News October 5, 2024
హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్ విడుదల
TG: హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చేశాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయగా తాజాగా అందుకు సంబంధించిన గెజిట్ విడుదలైంది. HYDలో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే చట్టబద్ధత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
News October 5, 2024
తెలుగు సినిమా షూటింగ్ నుంచి పారిపోయిన ఏనుగు
కేరళలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఓ తెలుగు సినిమా సెట్ నుంచి పుత్తుప్పలి సాధు అనే ఏనుగు పారిపోయింది. నిన్న రాత్రి షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెనుకవైపు నుంచి మరో ఏనుగు ఢీ కొట్టడంతో భయపడి సమీపంలోని అడవిలోకి సాధు పరిగెత్తిందని స్థానిక అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం ఏనుగును పట్టుకున్నామని, ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదని పేర్కొన్నారు.