News June 3, 2024
ఇజ్రాయెలీలను నిషేధించనున్న మాల్దీవులు
ఇజ్రాయెల్ పాస్‌పోర్టు ఉన్నవారు తమ దేశంలో ప్రవేశించకుండా నిషేధించనున్నట్లు మాల్దీవులు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా చట్టాలను మార్చే ప్రక్రియను పరిశీలించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా మాల్దీవులు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా గత ఏడాది దాదాపు 11,000 మంది ఇజ్రాయెలీలు ఆ దేశంలో పర్యటించారు.
Similar News
News September 13, 2024
కెనడాలో ఖలిస్థానీల బాంబు దాడి: పంజాబ్‌లో NIA సోదాలు
కెనడాలోని భారత హైకమిషన్‌పై ఖలిస్థానీ సపోర్టర్ల బాంబు దాడి కేసులో NIA పంజాబ్‌లో సోదాలు చేపట్టింది. ఉదయం నుంచే అధికారులు కొందరి ఇళ్లు, కార్యాలయాల్లో రైడ్స్ చేస్తున్నారని తెలిసింది. 2023, మార్చి 23న ఒట్టావాలో హై కమిషన్ ముందు దేశవ్యతిరేక నినాదాలు చేసిన ఖలిస్థానీలు త్రివర్ణ పతాకాలు తొలగించి తమ జెండాలు పాతారు. భవంతిలోకి 2 గ్రెనేడ్లు విసిరారు. దీనిపై నిరుడు జూన్‌లో NIA కేసు నమోదు చేసింది.
News September 13, 2024
హరీశ్ రావుకు వైద్య పరీక్షలు
TG: భుజం గాయంతో బాధపడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. నిన్న అరెస్ట్, ఆందోళనల సమయంలో ఆయన భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఆస్పత్రికి వెళ్లేందుకు మాత్రమే పోలీసులు తాజాగా ఆయనకు అనుమతినిచ్చారు.
News September 13, 2024
BRS నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకు దెబ్బ తీయండి: కోమటిరెడ్డి
TG: BRS పార్టీ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకి దెబ్బ తీయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం, ప్రభుత్వంపై BRS నేతలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు సహించకండి. రోడ్లపై తిరగకుండా అడ్డుకోండి. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీయాలనేదే వాళ్ల ఉద్దేశం. పదేళ్లు సెంటిమెంట్‌తో పరిపాలన చేశారు. మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ఆంధ్రా వాళ్లు ఓట్లేయకపోతే గెలిచేవారా?’ అని ప్రశ్నించారు.