News March 29, 2024
టీడీపీలో చేరిన మల్లెల రాజేశ్

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్ నాయుడు టీడీపీలో చేరారు. నారా లోకేశ్ సమక్షంలో ఆయనతో పాటు 10 మంది కౌన్సిలర్లు, ఒక జడ్పీటీసీ, ఇద్దరు సర్పంచులు టీడీపీ కండువా కప్పుకున్నారు. చిలకలూరిపేట సమన్వయకర్త పదవి నుంచి వైసీపీ తొలగించినప్పటి నుంచి రాజేశ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. టికెట్ కోసం మంత్రి రజనీ తన వద్ద రూ.6కోట్లు తీసుకున్నారంటూ ఆయన చేసిన <<12839437>>ఆరోపణలు <<>>దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Similar News
News February 11, 2026
ఆస్పత్రిలో అభిషేక్ శర్మ.. మ్యాచుకు కష్టమే!

డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఢిల్లీలో గౌతమ్ గంభీర్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లిన అభి.. నొప్పితో కాసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు క్రీడావర్గాలు వెల్లడించాయి. నిన్న ఆస్పత్రిలో చేరగా, నేడూ అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో రేపు నమీబియాతో జరిగే మ్యాచులో ఆడటం అనుమానమేనని సమాచారం. ఫిట్‌నెస్ ఆధారంగా FEB 15 పాక్‌తో మ్యాచ్ ఆడటంపై నిర్ణయం తీసుకోనున్నారు.
News February 11, 2026
తిరుమల కొండపై పూలు ఎందుకు ధరించరు?

శ్రీవారు అలంకార ప్రియుడు. కొండపై పూసే ప్రతి పువ్వు స్వామివారికే చెందాలనేది భక్తుల విశ్వాసం. పూర్వం ఓ శిష్యుడు దేవుడికి అర్పించాల్సిన పూలను తాను ధరించాడు. అలా ‘పరిమళ ద్రోహం’ చేసినట్లు పురాణ గాథ. అందుకే, అప్పటి నుంచి భక్తులు కొండపై పూలు పెట్టుకోకూడదనే నియమం వచ్చింది. స్వామికి అలంకరించిన పూలను కూడా ఇతరులకు ఇవ్వకుండా పవిత్రమైన బావిలోనే వేస్తారు. ఈ నియమం పాటించడం స్వామివారిపై ఉన్న భక్తికి నిదర్శనం.
News February 11, 2026
RRBలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల

<


