News October 10, 2024
టాటా మరణంపై మమత ట్వీట్: మొసలి కన్నీరు వద్దన్న నెటిజన్స్
రతన్ టాటా మరణం భారత వ్యాపార రంగానికి తీరని లోటన్న బెంగాల్ CM మమతా బెనర్జీ ట్వీటుపై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. సింగూరులో టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నానో’ను అడ్డుకొని ఇప్పుడు మొసలి కన్నీరు ఎందుకంటూ నిలదీస్తున్నారు. ‘మీ వల్ల టాటాకు చాలా నష్టమొచ్చింది. ఇక చాలు’, ‘సింగూరు నుంచి టాటా వెళ్లిపోయినప్పుడే నువ్వు ఓడిపోయావ్’, ‘మీ రాజకీయ వృద్ధి కోసం సింగూరు అభివృద్ధిని అడ్డుకున్నారు’ అని కామెంట్స్ పెడుతున్నారు.
Similar News
News November 11, 2024
ఢిల్లీకి కేటీఆర్.. ‘అమృత్’ స్కామ్‌పై కేంద్రానికి ఫిర్యాదు
TG: మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అమృత్ పథకంలో కుంభకోణం జరిగిందనే అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి లాభం చేకూరేలా అధికార దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
News November 11, 2024
బీఏసీ సమావేశానికి YCP గైర్హాజరు
AP: స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ గైర్హాజరైంది. ఈ ఉదయం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. రూ.2.94లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం సమావేశాలను ఎల్లుండికి వాయిదా వేశారు.
News November 11, 2024
KCRకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
TG: 10 నెలల్లో తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ప్రజలకు తెలిసొచ్చిందన్న KCR వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ జరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. డీఎస్సీతో ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. మిమ్మల్ని ప్రజలు మర్చిపోయారు’ అని తెలిపారు.