News March 16, 2024
మంచిర్యాల: ఇద్దరు ఆటో దొంగల పట్టివేత

మంచిర్యాల పట్టణంలో ఇద్దరు ఆటో దొంగలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సున్నం బట్టివాడలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమాల శ్రీధర్, వెంగళ శ్యాం కుమార్ దొంగిలించిన ఆటోలను తీసుకొని వెళుతుండగా పట్టుబడినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 2ఆటో లను సీజ్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు.
Similar News
News February 14, 2026
ADB: పుర పీఠం.. బద్ధ శత్రువుల’ కలయిక నిజమేనా?

ADB మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠం దక్కించుకోవడం ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. మొత్తం 51 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ 26 కాగా, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్(11), BRS(6), MIM(6) కలిసినా మెజారిటీకి ఇంకా ముగ్గురు స్వతంత్రుల మద్దతు అవసరం. మరోవైపు స్వతంత్రులు తమ వెంటే ఉన్నారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. పరస్పర విరుద్ధ భావజాలం గల పార్టీలు పీఠం కోసం జతకడతాయా అన్నది వేచి చూడాలి.
News February 14, 2026
ఆదిలాబాద్: కువైట్ నుంచి వచ్చి.. కౌన్సిలర్‌గా గెలిచి

ఆదిలాబాద్ కువైట్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన మెహబూబ్ 33వ వార్డులో విజయం సాధించారు. విదేశాల్లో ఉన్నప్పుడు ‘గోల్డెన్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్’ ద్వారా భారతీయుల సమస్యలపై పోరాడారు. స్వగ్రామంపై మక్కువతో ఎన్నికల బరిలో నిలిచి ఓటర్ల ఆదరణ పొందారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. సేవా దృక్పథమే తనను గెలిపించిందని మెహబూబ్ పేర్కొన్నారు.
News February 13, 2026
ఉట్నూర్: 4KGల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

నమ్మదగిన సమాచారంతో ఇంద్రవెల్లి పోలీసులు శ్మశానవాటిక వద్ద నిఘా ఉంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కొడప రమేష్, కుంర గంగారం, కుముర కృష్ణల వద్ద నుంచి 4కిలోల గంజాయి, మోటార్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను ఉట్నూర్ కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ సాయన్న వెల్లడించారు.


