News January 15, 2025
మంత్రి లోకేశ్‌ను కలిసిన మంచు మనోజ్

AP: నారావారిపల్లెలో హీరో మంచు మనోజ్ మంత్రి లోకేశ్‌ను కలిశారు. మనోజ్ ఇవాళ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోకి వెళ్లాల్సి ఉండగా పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. దీంతో మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారావారిపల్లెకు వెళ్లి లోకేశ్‌తో భేటీ అయ్యారు. వారు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు.
Similar News
News February 9, 2025
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

AP: తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఇందులో ఏఆర్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, పరాగ్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు. వీరిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సీబీఐ జేసీ వీరేశ్ ప్రభు తిరుపతిలోనే ఉండి విచారణను వేగవంతం చేశారు.
News February 9, 2025
చైతూని చూసి గర్విస్తున్నా: నాగార్జున

తన కొడుకు నాగచైతన్యను చూసి గర్విస్తున్నట్లు అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. ‘తండేల్’ కేవలం సినిమా మాత్రమే కాదని, చైతూ డ్రీమ్, కృషికి నిదర్శనమని కొనియాడారు. ఈ చిత్రాన్ని అందించిన అల్లు అరవింద్, బన్నీ వాస్, దర్శకుడు చందూ మొండేటికి ధన్యవాదాలు తెలియజేశారు. తమ కుటుంబానికి మద్దతుగా ఉన్న అక్కినేని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
News February 9, 2025
సినిమా ఆఫర్.. మాజీ CM కూతురికి రూ.4 కోట్లు టోకరా

సినిమా ఆఫర్ ఇస్తామంటూ కొందరు ఉత్తరాఖండ్ మాజీ CM రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కూతురు ఆరుషికి రూ.4 కోట్లకు టోకరా పెట్టారు. ముంబైకి చెందిన వరుణ్, మాన్సీలు నిర్మాతలమంటూ పరిచయం చేసుకున్నారు. విక్రమ్ మాస్సే హీరోగా తెరకెక్కించే మూవీలో కీలక పాత్రతో పాటు లాభంలో 20% షేర్ ఇస్తామని, పెట్టుబడి పెట్టాలని చెప్పారు. ఇది నమ్మి ఆమె విడతలవారీగా రూ.4 కోట్లు ఇచ్చారు. మూవీ ప్రారంభం కాకపోవడంతో మోసం చేశారని కేసు పెట్టారు.