News April 11, 2025

‘దొంగప్ప’ రిలీజ్ అంటూ మంచు మనోజ్ సెటైర్లు

image

మంచు కుటుంబంలో వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమాపై మనోజ్ సెటైర్లు వేశారు. ‘ది లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇంతకీ విడుదల జులై 17నా లేక జూన్ 27వ తేదీనా? రూ.100+ కోట్ల బడ్జెట్‌(ఇందులో 80 శాతం ViSmith కమీషన్)తో మూవీ PR ప్లానింగ్ కేక’ అని ట్వీట్ చేశారు.

Similar News

News April 21, 2025

మా పిల్లలు ఆలయాన్ని ఎంతో ఇష్టపడ్డారు: జేడీ వాన్స్

image

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ రోజు కుటుంబంతో కలిసి ఢిల్లీలోని అక్షర్‌ధామ్ మందిరాన్ని సందర్శించారు. ‘ఈ అద్భుత ప్రదేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించిన ఘనత భారత్‌కు దక్కుతుంది. మా పిల్లలు దీన్ని ఎంతగానో ఇష్టపడ్డారు’ అని టెంపుల్ విజిటర్ బుక్‌లో వాన్స్ రాశారు. కాగా US ఉపాధ్యక్షుడు కుటుంబసమేతంగా 4 రోజులు భారత్‌లో పర్యటించనున్నారు.

News April 21, 2025

అభిషేక్ నాయర్‌కు థాంక్స్ చెప్పిన రోహిత్

image

నిన్న CSKతో మ్యాచులో అర్ధసెంచరీతో ముంబైకి విజయాన్ని అందించిన రోహిత్ శర్మ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. తన ఫొటోను షేర్ చేస్తూ భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కు థాంక్స్ చెప్పారు. దీనిని అభిషేక్ షేర్ చేస్తూ ‘నథింగ్ బట్ లవ్’ అంటూ రీపోస్ట్ చేశారు. కాగా ఈ IPL సీజన్‌లో తొలుత విఫలమైన రోహిత్ తిరిగి గాడిన పడటంలో అభిషేక్ పాత్ర ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

News April 21, 2025

IPL: టాస్ గెలిచిన కేకేఆర్

image

ఈడెన్ గార్డెన్స్‌లో KKRvsGT మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్(5 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా కోల్‌కతా(3 విజయాలు) ఏడో స్థానంలో ఉంది.
జట్లు:
GT: గిల్, సుదర్శన్, బట్లర్, రూధర్‌ఫోర్డ్, షారుఖ్, తెవాటియా, రషీద్, సుందర్, కిశోర్, సిరాజ్, ప్రసిద్ధ్

KKR: గుర్బాజ్, నరైన్, రహానే, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమణ్‌దీప్, అలీ, వైభవ్, హర్షిత్, వరుణ్

error: Content is protected !!