News March 16, 2025
కన్నప్ప స్వగ్రామానికి మంచు విష్ణు

సినీ నటుడు మంచు విష్ణు శివభక్తుడు కన్నప్ప స్వగ్రామాన్ని సందర్శించారు. తన మూవీ టీమ్‌తో కలిసి అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరుకు వెళ్లారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్‌కుమార్‌తో పాటు ఇతర స్టార్లు నటించారు.
Similar News
News March 16, 2025
శ్రీచైతన్య స్కూల్లో ఘర్షణ.. భవనంపై నుంచి కింద పడ్డ బాలిక

తిరుపతిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఓ విద్యార్థిని రెండో ఫ్లోర్ నుంచి కింద పడిపోవడం కలకలం రేపింది. విద్యార్థినుల మధ్య గొడవ జరిగిన సమయంలో తోటి విద్యార్థిని ఆమెను పైనుంచి తోసేసిందని సమాచారం. కిందపడిన బాలికకు నడుం విరగడంతో పాటు తీవ్రగాయాలయ్యాయి. స్కూల్ యాజమాన్యం ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. ఘటనపై తిరుపతి అర్బన్ తహశీల్దార్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
News March 16, 2025
నేడు మాస్టర్స్ లీగ్ ఫైనల్

వివిధ దేశాల దిగ్గజ విశ్రాంత క్రికెటర్లు ఆడుతున్న మాస్టర్స్ లీగ్ తుది దశకు చేరుకుంది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియాకు సచిన్, విండీస్‌కు లారా కెప్టెన్లుగా ఉన్నారు. గ్రూప్ దశలో ఐదింట నాలుగు గెలిచిన భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటు సచిన్, యువీ.. అటు సిమన్స్, డ్వేన్ స్మిత్ మెరుపులు మెరిపిస్తుండటంతో ఫైనల్ ఆసక్తికరంగా మారింది.
News March 16, 2025
ఫ్రాంచైజీ క్రికెట్ రారాజు ముంబై

ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో ముంబై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. 2011 CLT20 టైటిల్‌తో మొదలైన కప్పుల వేట నిరంతరాయంగా కొనసాగుతోంది. IPLలో 5టైటిళ్లు గెలుచుకొని చెన్నైతో పాటు టాప్ ప్లేస్‌లో ఉంది. నిన్నజరిగిన WPL ఫైనల్లోనూ విజయం సాధించింది. మెుత్తంగా అన్ని క్రికెట్ లీగ్‌లలో కలిపి 12 టైటిళ్లు గెలిచింది. ఈ విజయాలతో ఫ్రాంచైజీ క్రికెట్లో నంబర్‌వన్ జట్టుగా సత్తా చాటుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.