News November 18, 2024

మణిపుర్ మంటలు: కశ్మీర్ దారిలో వెళ్లనున్న కేంద్రం!

image

<<14644158>>మణిపుర్‌లో<<>> శాంతి స్థాపనకు కేంద్రం జమ్మూకశ్మీర్ స్ట్రాటజీని అమలు చేయనుందని సమాచారం. ఇందుకోసం ఏడాది గడువు నిర్దేశించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్త సీఎంను నియమించడం లేదా రాష్ట్రపతి పాలన విధించొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ముందు కుకీ మిలిటెన్సీ అనుకూల అధికారుల్ని గుర్తించి వ్యవస్థను ప్రక్షాళన చేయనుంది. సాయుధ బలగాలతో కుకీ టెర్రరిస్టులను ఏరేస్తూ మయన్మార్‌ బోర్డర్‌ను పటిష్ఠంగా మార్చనుంది.

Similar News

News March 9, 2026

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,61,680కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 పతనమై రూ.1,48,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

News March 9, 2026

త్రిషకు సారీ చెప్పిన నటుడు పార్తీబన్

image

త్రిషను బయటకు రానివ్వకూడదంటూ తాను చేసిన <<19330179>>కామెంట్స్‌పై<<>> నటుడు, డైరెక్టర్ పార్తీబన్ విచారం వ్యక్తం చేశారు. ‘ఈవెంట్‌లో అంతా తప్పుగా జరిగింది. క్షమాపణ కోరడం తప్ప మరో మార్గం లేదు’ అని Xలో పోస్టు చేశారు. టీవీకే చీఫ్ విజయ్, త్రిష రిలేషన్ రూమర్స్ నేపథ్యంలో పార్తీబన్ చేసిన కామెంట్స్ వైరలైన విషయం తెలిసిందే. దీనిపై త్రిష కూడా <<19332584>>ఘాటుగా బదులివ్వడంతో<<>> ఆయన దిగి వచ్చారు.

News March 9, 2026

భారీ నష్టం తప్పదు.. ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు

image

తమపై దాడులు చేస్తోన్న ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు ఫైరవుతున్నాయి. అరబ్ దేశాలపై అటాక్స్ కొనసాగిస్తే టెహ్రాన్ భారీ నష్టాన్ని చవిచూస్తుందని సౌదీ హెచ్చరించింది. దీనివల్ల భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని తెలిపింది. అతి పెద్ద షైబా ఆయిల్ ఫీల్డ్‌పై దాడిని ఖండించింది. ఇరాన్ తమను మోసం చేసిందని ఖతర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులు చేయట్లేదని చెబుతూ డ్రోన్లతో విరుచుకుపడుతోందని మండిపడింది.